PM Modi: ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ సూపర్ పవర్.. ప్రశంసల వర్షం కురిపించిన జర్మన్ వ్యాపార దిగ్గజాలు..

నాయకత్వం అంటే ఇలా ఉండాలని జై కొడుతోంది. ఇలాంటి నాయకుడు తమకు కావాలని కొనియాడుతోంది. ఆయన చొరవకు ప్రపంచం మొత్తం సెల్యూట్ చేస్తోంది. తాజాగా భారత్‌లో పర్యటిస్తున్న జర్మన్ వ్యాపార దిగ్గజాలు కూడా..

PM Modi: ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ సూపర్ పవర్.. ప్రశంసల వర్షం కురిపించిన జర్మన్ వ్యాపార దిగ్గజాలు..
German Ceos Meet Pm Modi

Updated on: Feb 26, 2023 | 9:02 AM

ప్రపంచం మొత్తం సాహో అంటోంది. జయ జయకారాలు చేస్తోంది.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మేనియా ప్రపంచం మొత్తం చుట్టేస్తోంది. నాయకత్వం అంటే ఇలా ఉండాలని జై కొడుతోంది. ఇలాంటి నాయకుడు తమకు కావాలని కొనియాడుతోంది. ఆయన చొరవకు ప్రపంచం మొత్తం సెల్యూట్ చేస్తోంది. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం మేక్ ఇన్ ఇండియా కింద జర్మన్ టాప్ కంపెనీల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ (సీఈఓ)లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా, భారతదేశంలో ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడానికి, విద్య, వ్యాపార అవకాశాలను విస్తరించడానికి కొత్త అవకాశాలను వారు చర్చించారు.

ఇదిలావుండగా, డ్యుయిష్ పోస్ట్ డీహెచ్‌ఎల్ గ్రూప్ సీఈఓ అయిన డాక్టర్ టోబియాస్ మేయర్ మాట్లాడుతూ, భారతదేశంలో మేము నిజమైన సామర్థ్యాన్ని చూస్తున్నాం. డీహెచ్‌ఎల్ భారతదేశంలో 45 సంవత్సరాలకు పైగా పనిచేస్తోంది. భారతదేశం మాకు మంచి మార్కెట్, మేము ఇక్కడ ఊపందుకుంటున్నాము.

రాబోయే కొన్నేళ్లలో భారత్ సూపర్ పవర్..

హపాగ్-లాయిడ్ సీఈఓ అయిన రోల్ఫ్ హబెన్ జాన్సన్ మాట్లాడుతూ, “రాబోయే కొన్నేళ్లలో భారత్ అభివృద్ధి చెందుతుందని మాకు తెలుసు.. ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి ఇదే సరైన సమయం.” ‘మేక్ ఇన్ ఇండియా’ లాంటి కార్యక్రమం ప్రపంచానికి అవసరం. అదే సమయంలో, మేక్ ఇన్ ఇండియా చొరవ కింద పెట్టుబడులతో గ్రీన్ ఎనర్జీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, హెల్త్‌కేర్‌లో భారతదేశానికి భారీ సామర్థ్యం ఉందని సిమెన్స్ AG ప్రెసిడెంట్, CEO రోలాండ్ బుష్ అన్నారు. భారత్‌లో అధిక యువజనం, డిజిటల్ టెక్నాలజీ చాలా ఊపందుకుందన్నారు.

ఎస్‌ఎఫ్‌సీ ఎనర్జీ CEO డాక్టర్ పీటర్ పొడేసర్ మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో  సౌరశక్తి, గ్రీన్ హైడ్రోజన్‌లో టెక్నికల్ హబ్‌గా భారత్ మారుతోందని అన్నారు. తయారీ, పరిశోధన,  అభివృద్ధి, ఇంజినీరింగ్‌కు భారత్ తనను తాను మంచి పునాదిగా మార్చుకోగలదన్నారు.

కాగా, ప్రధానిని కలిసిన వారిలో రెంక్ సీఈవో సుజానే వీగాండ్ కూడా ఉన్నారు. ప్రధాని మోదీతో భేటీలో పాల్గొనడం చాలా గర్వంగా భావిస్తున్నామన్నారు. భారత్ మా విశ్వసనీయతకు భాగస్వామి. మేము ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్, నేవీకి డ్రైవ్ సొల్యూషన్స్ అందిస్తున్నామన్నారు.

భారత్‌ పర్యటనలో భాగంగా జర్మనీ ఛాన్సలర్‌..

రెండు రోజుల భారత్‌ పర్యటనలో భాగంగా జర్మనీ ఛాన్సలర్‌ ఒలాఫ్‌ షోల్జ్​ ఇండియాకు చేరుకున్నారు. ఢిల్లీకి చేరుకున్న ఒలాఫ్​కు విమానాశ్రయంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్​ చౌదరి ఘనస్వాగతం పలికారు. అనంతరం రాష్ట్రపతి భవన్​లో ఒలాఫ్‌ షోల్జ్​ను ప్రధాని మోదీ కలిశారు.

ద్వైపాక్షిక, ప్రాంతీయ, ప్రపంచ అంశాలపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. ఇరుదేశాల వ్యాపార వాణిజ్యం, పెట్టుబడులు, కొత్త టెక్నాలజీ, ఇంధనం, రక్షణ రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించడంపై చర్చలు జరపనున్నారు. ఈ పర్యటనలో భాగంగా భారత్​-జర్మనీల మధ్య వ్యూహాత్మక సంబంధాలు మరింత బలపడతాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ట్వీట్ చేశారు. 2021 డిసెంబర్‌లో జర్మన్ ఛాన్సలర్ అయిన తర్వాత షోల్జ్ భారతదేశానికి రావడం ఇదే మొదటి సారి.

మరిన్ని జాతీయ వార్తల కోసం