తొలి మహాదళపతిగా.. ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్

| Edited By:

Dec 30, 2019 | 11:51 PM

భారత తొలి మహాదళపతిగా ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ నియమించింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. మరో రోజులో ఆయన పదవీ విరమణ కానున్న తరుణంలో.. కేంద్రం ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్‌ 31 నుంచి ఆయన నియామకం అమల్లోకి రానుంది. ఆర్మీ చీఫ్‌గా ఆయన పదవీకాలం ఈ డిసెంబర్ 31తోనే ముగియనుంది. ఈ క్రమంలోనే చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌‌గా ఉత్తర్వులు వెలువడడం గమనార్హం. కొద్ది రోజుల క్రితమే […]

తొలి మహాదళపతిగా.. ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్
Follow us on

భారత తొలి మహాదళపతిగా ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ నియమించింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. మరో రోజులో ఆయన పదవీ విరమణ కానున్న తరుణంలో.. కేంద్రం ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్‌ 31 నుంచి ఆయన నియామకం అమల్లోకి రానుంది. ఆర్మీ చీఫ్‌గా ఆయన పదవీకాలం ఈ డిసెంబర్ 31తోనే ముగియనుంది. ఈ క్రమంలోనే చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌‌గా ఉత్తర్వులు వెలువడడం గమనార్హం. కొద్ది రోజుల క్రితమే ఏర్పాటైన.. ఈ మహాదళపతి (సీడీఎస్) పదవిని చేపట్టనున్న.. తొలి అధికారి బిపిన్ రావత్.

త్రివిధ దళాలకు సంబంధించిన అంశాలపై కేంద్ర ప్రభుత్వానికి ఏకైక సలహాదారుగా చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌(సీడీఎస్) వ్యవహరిస్తారు. ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మధ్య సమన్వయకర్తగా ఈ సీడీఎస్ ఉంటారు. అయితే మూడేళ్ల ఈ పదవి కోసం.. తొలి నుంచి ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ ముందు వరుసలో ఉన్నారు.