హింసాత్మకంగా మారిన రైతుల ట్రాక్టర్ ర్యాలీ, ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్ల మూసివేత, ప్రయాణికుల ఇబ్బందులు

ఢిల్లీలో శాంతియుతంగా సాగుతుందనుకున్న రైతుల ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారింది. సింఘు, టిక్రి బోర్డర్లతో సహా అనేక చోట్ల అన్నదాతలు..

హింసాత్మకంగా మారిన రైతుల ట్రాక్టర్ ర్యాలీ, ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్ల మూసివేత, ప్రయాణికుల ఇబ్బందులు
Follow us
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 26, 2021 | 2:05 PM

Farmers Protest: ఢిల్లీలో శాంతియుతంగా సాగుతుందనుకున్న రైతుల ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారింది. సింఘు, టిక్రి బోర్డర్లతో సహా అనేక చోట్ల అన్నదాతలు రెచ్చిపోయారు. తమను అడ్డుకోదలచిన పోలీసులతో ఘర్షణ పడ్డారు. ఖాకీలు లాఠీచార్జి చేసి, బాష్పవాయువును కూడా ప్రయోగించడంతో వారు మరింత ఆగ్రహం చెందారు. మొదట పోలీసులు సూచించిన రూట్లు కాదని ఇతర రూట్లలో కూడా వారు పెద్ద సంఖ్యలో నిరసనకు దిగడంతో  తీవ్ర ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది.  దీంతో దీని ప్రభావం ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ పై పడింది. నగరంలో అనేక చోట్ల ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను కార్పొరేషన్ మూసివేసింది. మెట్రో స్టేషన్ల గేట్ల మూసివేతతో ప్రయాణికుల అవస్థలు చెప్పనలవి కాకుండా పోయింది. ఏయే ప్రాంతాల్లో వీటిని మూసివేశారో ఆ వివరాలు..

అలాగే ప్రయాణికులు తమ రూట్లు మార్చుకుని వెళ్లాలని మెట్రో అధికారులు వాటి వివరాలను కూడా పేర్కొన్నారు.