అటవీ శాఖ అధికారుల సాయంతో ఏనుగు దంతాలు విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరు అటవీ శాఖ అధికారులు సహా ఆరుగురు అరెస్టు అయ్యారు. పొల్లాచి దగ్గర అనమలై అటవీ ప్రాంతంలో ఏనుగు మరణాలపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మణికందన్ కు చెందిన ఏనుగుల అంగడిలో అధికారులు తనిఖీలు నిర్వహించగా, ఈ ముఠా బట్టబయలైంది.
ఈ మధ్య కాలంలో ఏనుగుల మరణాలు అధికమవుతున్నాయి. అటవీ ప్రాంతాల్లో సంచరిస్తున్న వేటగాళ్లు ఏనుగులను చంపి వాటి దంతాలు, చర్మాన్ని విక్రయిస్తున్నారు. ఏనుగుల దంతాలకు అంతర్జాతీయ మార్కెట్లు మంచి డిమాండ్ ఉంది. అక్రమ సంపాదనకు అలవాటు పడిన కొందరు వేటగాళ్లు ఏనుగులను టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఏనుగులను చంపి వాటి దంతాలు, చర్మాన్ని విక్రయిస్తు భారీ మొత్తంలో సొమ్ము చేసుకుంటున్నారు. ఈ ముఠాలకు అటవీ శాఖ అధికారులు కూడా సాయం చేస్తుండటంతో వేటగాళ్లకు మరింత సులువుగా మారిపోయింది. అటవీ శాఖలో పని చేస్తున్న స్వామినాథన్, కాతవరయన్‌లు ఏనుగు దంతాల విషయంలో వీరికి సహరించినట్లు అధికారులు చెబుతున్నారు.