Gambia Cough Syrup: దడ పుట్టిస్తున్న దగ్గు, జలుబు సిరప్‌లు.. అలర్ట్ అయిన భారత ప్రభుత్వం..

|

Oct 07, 2022 | 9:31 PM

దగ్గు మందు పేరు వింటేనే భయమేస్తోంది. గాంబియా దేశంలో చిన్నారుల మరణానికి కారణంగా అనుమానిస్తున్న దగ్గు మందులు దేశంలో దుమారం రేపుతున్నాయి.

Gambia Cough Syrup: దడ పుట్టిస్తున్న దగ్గు, జలుబు సిరప్‌లు.. అలర్ట్ అయిన భారత ప్రభుత్వం..
Drugs Controller General of India
Follow us on

దగ్గు మందు పేరు వింటేనే భయమేస్తోంది. గాంబియా దేశంలో చిన్నారుల మరణానికి కారణంగా అనుమానిస్తున్న దగ్గు మందులు దేశంలో దుమారం రేపుతున్నాయి. ఆఫ్రికా దేశం గాంబియాలో దగ్గు, జలుపు సిరప్‌‌‌‌ల కలకలం రేగింది. 66 మంది చిన్న పిల్లలు చనిపోవడానికి ఇండియాలోని ఓ ఫార్మా కంపెనీకి చెందిన నాలుగు సిరప్‌‌‌‌లే కారణం కావచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన ప్రకటన సంచలనమైంది. కలుషిత సిరప్‌‌‌‌ల వల్ల పిల్లల్లో కిడ్నీలు తీవ్రంగా దెబ్బతిన్నాయని WHO చెప్పింది. ఆయా మందులపై ఇతర దేశాలకూ అలర్ట్ జారీ చేసింది. దీంతో కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించింది. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టింది. తయారీ కంపెనీ నుంచి నాలుగు మందుల శాంపిల్స్‌‌‌‌ సేకరించి టెస్టులకు పంపింది.

WHO అలర్ట్ నేపథ్యంలో మైడెన్ ఫార్మాస్యుటికల్ లిమిటెడ్ సంస్థపై DCGI దర్యాప్తు ప్రారంభించింది. హర్యానాలోని రెగ్యులేటరీ అధికారులతో ఈ విషయంపై అత్యవసర విచారణను చేపట్టింది.అయితే పిల్లల మరణాలకు సంబంధించిన కచ్చితమైన కారణాలను యునైటెడ్ నేషన్స్ హెల్త్ ఏజెన్సీ వెల్లడించలేదు..మరోవైపు 66 మంది పిల్లలు ఎప్పుడు చనిపోయారనే దానిపైనా క్లారిటీ ఇవ్వలేదు.గాంబియాకు సాంకేతిక సాయం చేస్తున్నామని, సలహాలను అందిస్తున్నామని డీసీజీఐకి సెప్టెంబర్ 29న WHO తెలిపినట్లు సమాచారం.

ఆ 4 మందులను మైడెన్ సంస్థ గాంబియాకు మాత్రమే సరఫరా చేస్తోంది. మైడెన్ సంస్థ తయారు చేసిన 4 సిరప్‌‌‌‌ల శాంపిల్స్‌‌‌‌ను కోల్‌‌‌‌కతాలోని సెంట్రల్‌‌‌‌ డ్రగ్స్ లాబోరేటరీకి పంపినట్లు హర్యానా ఆరోగ్య మంత్రిచెప్పారు. మైడెన్ సంస్థ తయారు చేసిన దగ్గు సిరప్‌‌‌‌లను ఎగుమతి చేసేందుకు అనుమతులు ఉన్నాయని వివరించారు. మన దేశంలో అమ్మడానికి లేదా మార్కెటింగ్‌‌‌‌ చేసేందుకు ఇవి అందుబాటులో లేవన్నారు. సీడీఎల్ రిపోర్టు వచ్చాక వాస్తవాలు తెలుస్తాయన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..