వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ తమ దేశానికి అప్రదిష్ట తెచ్చాడని, అతడిని తమ దేశం నుంచి వెళ్ళగొట్టాలని అనుకున్నామని ఆంటిగ్వా, బర్బుడా ప్రధాని గేస్టన్ బ్రౌన్ అన్నారు. గత ఆదివారం మెహుల్ చోక్సీ ఈ దేశం నుంచి పరారయ్యాడు. మిస్సింగ్ కేసు కింద అతనికోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆంటిగ్వా నుంచి క్యూబాకు వెళ్లి ఉండవచ్చునని భావిస్తున్నారు. కానీ మిస్సింగ్ అయ్యాడని కూడా విశ్వసనీయంగా చెప్పలేమని ఆంటిగ్వా ప్రధాని పేర్కొన్నారు. మా దేశానికి మెహుల్ ప్రతిష్ట తేలేకపోయాడు.. అతడు ఎక్కడికి వెళ్ళాడో తెలుసుకోవాలని మాకు కూడా ఆసక్తిగా ఉంది అని ఆయన అన్నారు. ఇండియాకు అతడిని ఎంత త్వరగా అప్పగించాలా అని యోచిస్తున్నామన్నారు. క్యూబాకు వెళ్లి ఉంటాడని వార్తలు వస్తున్నాయని, కానీ ఇక్కడి నుంచి ఆ దేశానికి విమానాలేవీ లేవని ఆయన తెలిపారు. బహుశా నౌకలోనో, బోటులోనో వెళ్లి ఉండవచ్చు అన్నారు.చోక్సీ కేసుకు సంబంధించి తమ దేశ అధికారులు భారత అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు సాగిస్తున్నారని, అతడి ఆచూకీ తెలియగానే వెల్లడిస్తారని ఆయన చెప్పారు.అతడిని అప్పగించే విషయంలో పూర్తిగా సహకరిస్తామని హామీ ఇచ్చారని ఆయన చెప్పారు. పైగా తాను కూడా ఇక్కడి భారత హైకమిషనర్ తో మాట్లాడానని అన్నారు.
ఇండియాను గొప్ప దేశంగా బ్రౌన్ ప్రశంసించారు. ప్రధాని మోదీ తమకు మంచి మిత్రుడని, ఇండియానుంచి 5 లక్షల డోసుల వ్యాక్సిన్ తమ దేశానికి అందిందన్నారు. ఈ టీకామందుతో తమ దేశంలో వేలాది మందికి వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టామన్నారు. కాగా మెహుల్ చోక్సీ కి ఆంటిగ్వా పౌరసత్వం ఎలా ఇచ్చారన్నది ప్రశ్నగా మారింది.
మరిన్ని చదవండి ఇక్కడ ఇక్కడ : గుంతలో పడిన గున్న ఏనుగు…రక్షించడానికి నానా తంటాలు… చివరకు…?? ( వీడియో )
Cyclone Yaas: అల్లకల్లోలం సృష్టిస్తున్న యాస్ తుఫాన్.. నివాస ప్రాంతాల్లోకి సముద్రం నీరు.. వీడియో..