Fuel Price Today: గత కొద్దిరోజులుగా రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యులకు అందనంత ఎత్తుకు ఎగబాకాయి. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ఏకంగా రూ.100కు చేరింది. ఇక డీజిల్ కూడా పెట్రోల్‌తో పోటీపడి మరీ పెరుగుతుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం పెట్రోల్ ధరలు బుధవారం(10/3/2021) స్థిరంగా కొనసాగుతున్నాయి. మంగళవారం మాదిరిగానే . బుధవారం ఇంధన ధరల్లో ఎలాంటి మార్పులు కనిపించలేడు. దేశ రాజధాని ఢిల్లీ నుంచి తెలుగు రాష్ట్రాల వరకు లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం..
దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.91.17 ఉండగా (మంగళవారం రూ.91.17), డీజిల్ ధర రూ.81.47 వద్ద (మంగళవారం రూ.81.47) కొనసాగుతోంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.97.57 గా ఉండగా (మంగళవారం రూ.97.57), డీజిల్ రూ.88.60 (మంగళవారం రూ.88.60) గా ఉంది.
అలాగే తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో మంగళవారం తో పోలిస్తే ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరల్లో పెద్దగా మార్పులు కనిపించలేవు. ఇక్కడ లీటర్ పెట్రోల్ ధర బుధవారం రూ.94.79 (మంగళవారం రూ.94.79) ఉండగా, డీజిల్ ధర రూ.88.86 (మంగళవారం రూ.88.86)గా నమోదైంది. ఇక తెలంగాణలో మరో ముఖ్య పట్టణం కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ రూ.94.88 (మంగళవారం రూ.94.67), డీజిల్ రూ.88.92 (మంగళవారం రూ.88.73)గా నమోదైంది.
ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే.. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.97.50 (మంగళవారం రూ.97.39 ), డీజిల్ ధర రూ. 91.01(మంగళవారం రూ.90.91) వద్ద కొనసాగుతోంది. సాగర తీరం విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.37 (మంగళవారం రూ.96.13)గా ఉండగా, లీటర్ డీజిల్ రూ.89.91(మంగళవారం రూ.89.69)గా వద్ద కొనసాగుతోంది.
తమిళనాడు రాజధాని చెన్నైలో ఈరోజు లీటర్ పెట్రోల్ ధర రూ.93.11 ఉండగా (మంగళవారం రూ.93.11 ), డీజిల్ ధర రూ.86.45 (మంగళవారం రూ.86.45) వద్ద కొనసాగుతోంది. ఇక కర్నాటక రాజధాని బెంగళూరులో శుక్రవారం లీటర్ పెట్రోల్ ధర రూ.94.22 (మంగళవారం రూ.94.22 ), ఉండగా డీజిల్ ధర రూ. 86.37 (మంగళవారం రూ.86.37 ) గా ఉంది.
మరిన్ని ఇక్కడ చదవండి :
దగా పడుతున్న రైతన్న, స్వరాజ్ ఇండియా నేత యోగేంద్ర యాదవ్ స్టడీలో వెల్లడైన వైనం