Success Story of Jatin Ahuja : తండ్రి దగ్గర రూ.70 వేలు అప్పు తీసుకుని… నేడు 300 కోట్లకు అధిపతి అయ్యాడు..

|

Feb 24, 2021 | 1:34 PM

ఈరోజు బిజినెస్ రంగంలో తమకంటూ ఓ చరిత్ర పుటల్లో పేజీ లిఖించుకున్న వారి ఎందరో.. చిన్న మొత్తంలో మొదలు పెట్టిన వ్యాపారం అంచెలంచెలుగా అభివృద్ధి చెంది.. ఉన్నత శిఖరాలను అధిరోహించినవారు ..

Success Story of Jatin Ahuja : తండ్రి దగ్గర రూ.70 వేలు అప్పు తీసుకుని... నేడు 300 కోట్లకు అధిపతి అయ్యాడు..
Follow us on

Success Story of Jatin Ahuja: ఈరోజు బిజినెస్ రంగంలో తమకంటూ ఓ చరిత్ర పుటల్లో పేజీ లిఖించుకున్న వారి ఎందరో.. చిన్న మొత్తంలో మొదలు పెట్టిన వ్యాపారం అంచెలంచెలుగా అభివృద్ధి చెంది.. ఉన్నత శిఖరాలను అధిరోహించినవారు ఎప్పటికీ అందరికీ ఇన్స్పిరేషన్ గా నిలుస్తారు. అటువంటి సక్సెస్ పర్సన్ గురించి ఈరోజు తెలుసుకుందాం..!

జతిన్ అహుజా ఈ పేరు పెద్దగా పరిచయం లేకపోయినా.. ఇతని వ్యాపార సంస్థల పేరు చెప్పిన వెంటనే గుర్తుపడతారు. బిగ్ బాయ్ టాయ్స్ వ్యవస్థాపకుడు జతిన్ అహుజా.. గత ఏడాది కరోనా సమయంలో విధించిన లాక్ డౌన్ సమయంలో ఏ కంపెనీకి సరైన బిజినెస్ జరగలేదు.. ఇంకా చెప్పాలంటే గత ఏడాది ఏప్రిల్ నెలలో లాక్ డౌన్ కారణంగా ఒక్క కొత్త కారు అమ్మకం జరగలేదు. అయితే జతిన్ మాత్రం 12 సెకండ్ హ్యాండ్ లగ్జరీ కార్లను విక్రయించాడు. వీటి విలువ రూ. 13 కోట్లు.

అహుజా మెకానికల్ ఇంజినీరింగ్, ఆ తర్వాతీ ఎంబీఏ చదివారు.. అయితే అందరిలా ఉద్యోగం చేయాలనుకోలేదు.. వ్యాపారం పై దృష్టి పెట్టాడు.. తన 23 ఏళ్ల వయసులో తండ్రి దగ్గర రూ. 70 వేల ను అప్పుగా తీసుకుని బీబీటీ కంపెనీని స్టార్ట్ చేశారు. దేశరాజధాని ఢిల్లీలో ఓ చిన్న షో రూమ్ ను తెరచారు. లగ్జరీ కార్లను చాలా మందికి అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో ఈ సంస్థను ప్రారంభించాడు.
దానిని వృద్ధిలోకి తెచ్చేందుకు అహుజా తీవ్రంగా శ్రమించాడు. సక్సెస్సయ్యాడు. ఇప్పుడీయన కింద 150 మంది పని చేస్తున్నారు.

ఇక అహుజా ఈ వ్యాపారంలో ఇప్పటివరకు రూ.300 కోట్లు సంపాదించాడు. కోహ్లీ, రోహిత్, ప్రీతి జింటా వంటి ఎందరో ప్రాముఖులు జతిన్ కస్టమర్లే.. ప్రస్తుతం ఈయనకు ముంబై, గురుగ్రామ్, హైదరాబాద్‌ల్లో కంపెనీ షోరూమ్‌లున్నాయి.

Also Read

లోటస్‌పాండ్‌లో విద్యార్థల సందడి.. మీ అక్కగా సమాజాన్ని మార్చేందుకే వచ్చా.. ఇంకేమీ మాట్లాడారంటే..

 మా ఇద్దరి మధ్య ఎటువంటి విబేధాలు లేవు… త్వరలో మేము కలిసి నటిస్తామన్న అలీ

: