ప్రాణం తీసిన పబ్జీ.. గేమ్ లో విభేదాలతో స్నేహితుడిపై కత్తితో దాడి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే

|

Mar 01, 2022 | 5:02 PM

కరోనా ప్రభావంతో సెల్ ఫోన్(Cell Phones) లు జీవితంలో భాగమయ్యాయి. ఆన్ లైన్ క్లాసుల(Online Classes) పేరుతో చిన్నారులు, విద్యార్థులు, యువకుల చేతుల్లో సెల్ ఫోన్ లు ప్రత్యక్షమవుతున్నాయి. అయితే వాటి వల్ల ఎంత...

ప్రాణం తీసిన పబ్జీ.. గేమ్ లో విభేదాలతో స్నేహితుడిపై కత్తితో దాడి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే
Pub G
Follow us on

కరోనా ప్రభావంతో సెల్ ఫోన్(Cell Phones) లు జీవితంలో భాగమయ్యాయి. ఆన్ లైన్ క్లాసుల(Online Classes) పేరుతో చిన్నారులు, విద్యార్థులు, యువకుల చేతుల్లో సెల్ ఫోన్ లు ప్రత్యక్షమవుతున్నాయి. అయితే వాటి వల్ల ఎంత ఉపయోగం ఉందో, అంతే నష్టం ఉందన్న విషయాన్ని మాత్రం పట్టించుకోవడం లేదు. ఫలితంగా ఆన్ లైన్ గేమ్ లకు బానిసవుతున్నారు. నిన్న మొన్నటి వరకు బ్లూ వేల్, నేడు పబ్జీ(Pub G), ఫ్రీ ఫైర్.. పేరు ఏదేమైనా అంతులేని నష్టాన్ని మిగుల్చుతున్నాయి. తాజాగా మహారాష్ట్రలోని థానే లో జరిగిన ఓ ఘటన ఒళ్లు గగుర్పొడిచేలా చేసింది. వారందరూ పబ్జీకి బానిసయ్యాడు. రోజూ గ్రూపులుగా ఏర్పడి పబ్జీ ఆడటమే వారి పని. రోజంతా ఆన్ లైన్ గేమ్‌ ఆడుకుంటూ కాలం వెళ్లదీసేవారు. ఓ రోజు వీరు పబ్జీ ఆడుతుండగా.. వీరి మధ్య విభేదాలు తలెత్తాయి. కోపంలో విచక్షణ కోల్పోయిన ముగ్గురు యువకులు తమ స్నేహితుడిపై కత్తితో దాడి చేశారు. ఈ ఘటనలో బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు. చేతికందిన బిడ్డ కళ్లముందే పాడు గేమ్స్‌కు బానిసై ప్రాణం కోల్పోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

మహారాష్ట్ర థానే లోని వర్తక్ ప్రాంతానికి చెందిన నలుగురు యువకులు తరచూ ఆన్ లైన్ గేమ్ పబ్ జీ ఆడేవారు. ఆడుతున్న సమయంలో తమలో తాము గొడవ పడేవారు. ఈ క్రమంలో రోజూలాగే పబ్ జీ ఆడుతున్న యువకుల మధ్య గొడవ జరిగింది. మద్యం మత్తులో ఘర్షణకు దిగారు. ఈ గొడవ చినికీ చినికీ గాలివానలా మారింది. మద్యం మత్తు, ఆన్ లైన్ గేమింగ్, ఆవేశం వంటి కారణాలతో విచక్షణ కోల్పోయిన ముగ్గురు యువకులు.. తమ స్నేహితుడిని పదునైన కత్తితో పొడిచారు. ఈ ఘటనలో బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి, శవపరీక్ష కోసం ఆస్పత్రికి తరలించారు.

హత్యకు పాల్పడిన ముగ్గురిలో ఒకరిని అరెస్టు చేశారు. ఇద్దరు మైనర్లు కావడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోనూ పబ్ జీ గేమ్ ఆడేందుకు తండ్రి మొబైల్ కొనివ్వకపోవడంతో 12వ తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. తన పుట్టినరోజు బహుమతిగా సెల్ ఫోన్ కొనివ్వకపోవడంతో.. మనస్తాపంతో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కోపం వచ్చింది. ఆ తర్వాత ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Also Read

Sarkaru Vaari Paata: సూపర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌కు శివరాత్రి కానుక.. మాస్‌ కిక్కు ఇస్తోన్న మహేశ్‌ కొత్త పోస్టర్‌..

Goa Election 2022: రసవత్తరంగా గోవా రాజకీయం.. ఫలితాలకు ముందే బేరసారాలు.. ఆ ఐదుగురుపైనే నజర్

Kacha Badam Singer: సోషల్ మీడియా సెన్సెషనల్ కచ్చా బాదమ్‌ సింగర్‌కు యాక్సిడెంట్.. ఆసుపత్రిలో చికిత్స