Vaccination Drive: దేశవ్యాప్తంగా ఫ్రీ వ్యాక్సిన్ ఇస్తే మోదీ ప్రభుత్వానికి ఖర్చయ్యేది ఎంతో తెలుసా ? కేంద్ర బడ్జెట్లో కేటాయించినదానికన్నా ఎక్కువే..

| Edited By: Phani CH

Jun 08, 2021 | 12:41 PM

ఉచిత వ్యాక్సిన్ ఇచ్చిన కారణంగా కేంద్రానికి 45 వేల కోట్ల రూపాయలు ఖర్చవుతాయని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. ఇది కేంద్ర బడ్జెట్లో అంచనా వేసినదానికన్నా 10 వేల కోట్లు ఎక్కువని..

Vaccination Drive: దేశవ్యాప్తంగా ఫ్రీ వ్యాక్సిన్ ఇస్తే మోదీ ప్రభుత్వానికి ఖర్చయ్యేది ఎంతో తెలుసా ? కేంద్ర బడ్జెట్లో కేటాయించినదానికన్నా ఎక్కువే..
Vaccination
Follow us on

ఉచిత వ్యాక్సిన్ ఇచ్చిన కారణంగా కేంద్రానికి 45 వేల కోట్ల రూపాయలు ఖర్చవుతాయని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. ఇది కేంద్ర బడ్జెట్లో అంచనా వేసినదానికన్నా 10 వేల కోట్లు ఎక్కువని..పేరు చెప్పడానికి ఇష్టపడని ఆ అధికారు అన్నారు. ప్రధాని మోదీ నిన్న దేశప్రజలనుద్దేశించి చేసిన ప్రసంగంలో.. రానున్న రెండు వారాల్లో కేంద్రం, రాష్ట్రాలు కొత్త గైడ్ లైన్స్ ప్రకారం పని చేస్తాయని, ఈ నెల 21 నుంచి 18 ఏళ్ళు పైబడినవారికందరికీ ఉచిత వ్యాక్సిన్ ఇస్తామని చెప్పారు. ఉత్పత్తిదారుల నుంచి రాష్ట్రాలు 25 శాతం టీకామందులను ప్రొక్యూర్ చేసుకోవాలన్న లిబరలైజ్డ్ పాలసీని మే 1 నుంచి అమలు చేశామని, కానీ దాన్ని మారుస్తున్నామని అయన వెల్లడించారు. ఇప్పటికే 50 శాతం ప్రొక్యూర్ చేస్తున్నదానితో సహా కేంద్రం 75 శాతం ప్రొడక్షన్ ను పొంది దాన్ని ఫ్రీగా రాష్ట్రాలకు పంపిణీ చేస్తుందన్నారు. రానున్న రోజుల్లో చేయాల్సిన సప్లయ్ గురించి రాష్ట్రాలకు తెలియజేస్తామన్నారు. అయితే ప్రతిపక్షాలు అప్పుడే ఈ పాలసీపై పెదవి విరిచాయి. అందరికీ ఉచిత వ్యాక్సిన్ ఇస్తున్నప్పుడు ప్రైవేటు ఆసుపత్రులు దీనికి సామాన్యుల నుంచి ఎందుకు సొమ్ము వసూలు చేయాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. అలాగే ఈ పాలసీని మోదీ ప్రభుత్వం తరచూ మారుస్తూ ప్రజల్లో అయోమయం సృష్టిస్తోందని ఈ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా ఆరోపించారు. రాష్ట్రాలపై ఆరోపణలు చేసే బదులు ప్రధాని ఇందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

ప్రైవేటు హాస్పిటల్స్ లో మధ్యతరగతివారు…ఇతర సామాన్యులు ఇంకా వ్యాక్సిన్ కోసం ఎందుకు డబ్బు చెల్లించాలని ఆయన ప్రశ్నించారు. మొదట జనవరి 16న, ఆ తరువాత రెండోసారి మే 1 న, ఇప్పుడు తాజాగా నిన్న వ్యాక్సినేషన్ పాలసీని మార్చిన ఘనత మీదేనని ఆయన ఎద్దేవా చేశారు. సుప్రీంకోర్టు మందలించిన ఫలితంగానే ఇలా మార్పులు చేశారన్నారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Corona Virus: ప్రాణాలతో చెలగాటం…..5 నిముషాల్లో ఆక్సిజన్ లేక 22 మంది కోవిద్ రోగుల మృతి.. హాస్పిటల్ యజమాని ‘ప్రయోగం’లో షాకింగ్ డీటెయిల్స్

ఓ ఇంజనీర్ లీలలు.. పెళ్లి పేరిట 12 మంది యువతులపై లైంగిక వేధింపులు.. ఆ తర్వాత ఏమైందంటే.?