ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు మావోలు హతం

| Edited By: Srinu

Jul 06, 2019 | 5:45 PM

దండకారణ్యంలో మరోసారి కాల్పుల మోత మోగింది. ధంతరీ ప్రాంతంలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ సిబ్బందికి, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఎస్టీఎఫ్ సిబ్బంది కూంబింగ్ చేపడుతున్న సమయంలో.. మావోయిస్టులు కాల్పులకు దిగారు. దీంతో అప్రమత్తమైన ఎస్టీఎఫ్ సిబ్బంది.. ఎదురుకాల్పులకు దిగారు. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. ఘటనాస్థలి నుంచి ఏడు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు మావోలు హతం
Follow us on