మహారాష్ట్రలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నదీ స్నానానికి వెళ్లిన ముగ్గురు పిల్లలతో సహా ఓ మహిళ మృత్యువాత పడగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ధమంగవ్ రైల్వే తాలూకాలోని నింఫోరా రాజ్ గ్రామంలో నివసించే ఓ కుటుంబం ఆదివారం ఉదయం 6 గంటలకు గ్రామ శివారులోని చంద్రభాగ నదిలో స్నానాలు చేసి, పూజలు చేసేందుకు వెళ్లారు.
ఇదే క్రమంలో చిన్నారులతో పాటు మిగతా వారంతా స్నానాలు చేసేందుకు నీటిలో దిగారు. దీంతో ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరగడటంతో బయటకు రాలేకపోయారు. ఇది గమనించిన స్థానికులు వారిని ఒడ్డుకు తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. కానీ, అప్పటికే ముగ్గురు చిన్నారులతో సహా మహిళ మృత్యువాత పడింది. మరో ఇద్దరు మహిళలు ప్రాణాలతో బయటపడగా.. వారి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. వారిని వెంటనే చికిత్స నిమిత్తం అమరావతి జిల్లా జనరల్ హాస్పిటల్‌కు తరలించారు.
दुर्देवी ! चंद्रभागा नदीत बुडून 3 चिमुकल्यांसह एका महिलेचा मृत्यू, 2 महिला गंभीर#chandrabhagariver #amravati #policenama @Policenama1 https://t.co/RdC9Fm1Bxm
— Policenama (@Policenama1) September 27, 2020
మృతులను యశ్ ప్రమోద్ చావ్రే (11), జీవన్ ప్రదీప్ చావ్రే (15), సోహం దినేష్ జెలే (12), చిముకళ్యాంచె, పుష్ప దిలీప్ చావ్రే (32)గా పోలీసులు గుర్తించారు. బేబీ ప్రదీప్ చావ్రే (35), రాధా గోపాల్‌రావ్ మాలియే (38)ల పరిస్థితి విషమంగా ఉంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న ఎమ్మెల్యే ప్రతాప్ అడ్సాద్ మృతుల కుటుంబాలను పరామర్శించారు. ఇందుకు సంబంధించి పూర్తి విచారణ జరిపించాలని తాలూకా పరిపాలనను ఆదేశించారు.