Telangana: అంత్యక్రియలు చూసేందుకు వచ్చిన అన్నదమ్ములు.. చివరికి ఏం జరిగిందో తెలిస్తే కన్నీళ్లు పెట్టకుండా ఉండలేరు

సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం చౌటపల్లిలో తీవ్ర విషాదం నెలకొంది. అంత్యక్రియల కోసం సొంత గ్రామానికి వచ్చిన నలుగురు అన్నదమ్ములు తిరిగి వెళ్తు రోడ్డు ప్రమాదంలో మరణించడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే.. చౌటపల్లికి చెందిన ఎరుకల కృష్ణ(47), సంజీవ్‌(43), సురేష్‌(38), వాసు(35)లు కొన్నేళ్ల క్రితం బతుకుదెరువు కోసం గుజరాత్‌లోని సూరత్‌కు వెళ్లారు.

Telangana: అంత్యక్రియలు చూసేందుకు వచ్చిన అన్నదమ్ములు.. చివరికి ఏం జరిగిందో తెలిస్తే కన్నీళ్లు పెట్టకుండా ఉండలేరు
Death

Updated on: May 25, 2023 | 4:54 AM

సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం చౌటపల్లిలో తీవ్ర విషాదం నెలకొంది. అంత్యక్రియల కోసం సొంత గ్రామానికి వచ్చిన నలుగురు అన్నదమ్ములు తిరిగి వెళ్తు రోడ్డు ప్రమాదంలో మరణించడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే.. చౌటపల్లికి చెందిన ఎరుకల కృష్ణ(47), సంజీవ్‌(43), సురేష్‌(38), వాసు(35)లు కొన్నేళ్ల క్రితం బతుకుదెరువు కోసం గుజరాత్‌లోని సూరత్‌కు వెళ్లారు. ఆ తర్వాత అక్కడే స్థిరపడిపోయారు. అయితే ఐదు రోజుల క్రితం తమ స్వగ్రామంలో వాళ్ల చిన్న నాన్న ఎరుకల కనకయ్య మృతి చెందాడు. దీంతో ఆ అన్నదమ్ములు హుటాహుటీనా సొంత ఊరికి వచ్చేశారు.

ఇక అంత్యక్రియలు పూర్తి కావడంతో మంగళవారం మధ్యాహ్నం నలుగురు అన్నదమ్ములూ భార్యా పిల్లలను గ్రామంలో వదిలి, కారులో సూరత్‌కు బయలుదేరారు.అర్ధరాత్రి దాటిన తర్వాత మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి పల్టీలు కొట్టింది.ఈ దుర్ఘటనలో ముగ్గురు అన్నదమ్ములు అక్కడికక్కడే మృతి చెందగా కొద్దిసేపటి తర్వాత మరొకరు మృతి చెందారు. అయితే ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అన్నదమ్ములు మృతి చెందడంతో ఆ కుటుంబంతో పాటు గ్రామస్థులు కన్నీరుమున్నీరవుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

ఇవి కూడా చదవండి