సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఏఆర్ లక్ష్మణన్(78) కన్నుమూశారు. సతీమణి మరణంతో మానసిక కుంగుబాటుకు గురై ఓ ప్రైవేటు ఆస్పత్రిలో రెండు రోజుల పాటు చికిత్స పొందిన ఆయన గురువారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం వీరు కారైకుడిలో నివసిస్తున్నారు. మంగళవారం లక్ష్మణన్ భార్య మీనాక్షి ఆచ్చి అనారోగ్యంతో మరణించారు. దీంతో ఆయన మానసిక కుంగుబాటుకు గురై అస్వస్థతకు లోనయ్యారు. తిరుచ్చిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మరణించారు.
కాగా జస్టిస్ ఏఆర్ లక్ష్మణన్ 1942 మార్చి 22న తమిళనాడులో శివగంగై జిల్లా దేవకొట్టైలో జన్మించారు. మద్రాసు హైకోర్టు, కేరళ హైకోర్టులలో న్యాయమూర్తిగా సేవలందించారు. 2000లో రాజస్థాన్, 2001లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులలో ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారు. ఇక 2002లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2007లో రిటైర్ అవ్వగా.. ఆ తర్వాత రెండేళ్లపాటు లా కమిషన్ చైర్మన్‌గా వ్యవహరించారు. పలు కేసుల్లో సంచలనమైన తీర్పులను వెల్లడించిన ఘనత లక్ష్మణన్‌కు ఉంది.
Read More:
నిత్యానందపై పొగడ్తల వర్షం కురిపించిన తమిళ నటి
వరల్డ్ కరోనా అప్‌డేట్స్.. 2.46కోట్లకి చేరిన పాజిటివ్ కేసులు