Manmohan Singh: క్షీణించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆరోగ్యం.. ఎయిమ్స్‌లో అత్యవసర చికిత్స అందిస్తున్న వైద్యులు

|

Oct 13, 2021 | 7:03 PM

భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆరోగ్యం మంగళవారం అకస్మాత్తుగా క్షీణించింది. అతను శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు.

Manmohan Singh: క్షీణించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆరోగ్యం.. ఎయిమ్స్‌లో అత్యవసర చికిత్స అందిస్తున్న వైద్యులు
Manmohan Singh
Follow us on

Manmohan Singh Admitted in AIIMS:  భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆరోగ్యం మంగళవారం అకస్మాత్తుగా క్షీణించింది. అతను శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. దీంతో ఆయన్ను అత్యవసర చికిత్స నిమిత్తం CN టవర్ ఆఫ్ ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) లో చేర్చారు. డాక్టర్ రణ్ దీప్ గులేరియా, ఎయిమ్స్ నేతృత్వంలో వైద్య బృందం ప్రస్తుతం ఆయనకు వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు.

మన్మోహన్ సింగ్ ఈ ఏడాది ఏప్రిల్ 19 న కరోనా వైరస్ బారిన పడ్డారు. దీంతో ఆయననను ఎయిమ్స్‌లో చేర్చారు. స్వల్పంగా జ్వరం వచ్చిన తర్వాత అతనికి కరోనా వైరస్ సోకినట్లు తేలింది. ఆ తర్వాత మార్చి 4, ఏప్రిల్ 3 న రెండు మోతాదుల కరోనా వ్యాక్సిన్‌లను కూడా తీసుకున్నారు. 2009 లో మన్మోహన్ సింగ్‌ ఎయిమ్స్‌లో బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. మన్మోహన్ సింగ్ ప్రస్తుతం రాజస్థాన్ నుండి రాజ్యసభ సభ్యుడుగా కొనసాగుతున్నారు. అతను 2004 నుండి 2014 వరకు దేశ ప్రధాన మంత్రిగా ఉన్నారు.


Read Also… Andhra Pradesh: ఏపీలో నైట్ కర్ఫ్యూ పొడిగింపు.. ఈ టైం దాటాక బయట కనిపించారో అంతే