
తమిళనాడు పోలీసులపై డీఎంకే నేత, మాజీ ఎంపీ కే అర్జునన్ దురుసుగా ప్రవర్తించారు. ఓ పోలీసుపై ఏకంగా చేయి చేసుకున్నాడు. సేలంలోని ఓ టోల్ గేట్ వద్ద అర్జునన్‌కు సంబంధించిన కారును పోలీసులు ఆపారు. పోలీసులు జారీ చేసిన ఈ-పాస్‌ను చూపించాలంటూ కోరారు. దీంతో తననే ఈ పాస్ అడుగుతారా.. అంటూ తీవ్ర ఆగ్రహంతో విధులు నిర్వర్తిస్తున్న పోలీసుపై చేయి చేసుకున్నాడు. కాలుతో తన్నుతూ తోసేశాడు. అంతేకాదు.. అసభ్యకరమైన పదజాలం ఉపయోగిస్తూ దూషించారు. దీనికి సంబంధించిన వీడియోలన్నీ టోల్ గేట్ వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
#WATCH: Former MP K Arjunan hits a police personnel on duty near Salem check-post who sought an e-pass from him as per #COVID19Lockdown guidelines. #TamilNadu (28/6) pic.twitter.com/siSU2fukIp
— ANI (@ANI) June 29, 2020