సీబీఐ మాజీ డైరెక్టర్, నాగాలాండ్ మాజీ గవర్నర్ అశ్వినీ కుమార్ సిమ్లా లోని తన నివాసంలో విగత జీవిగా కనిపించారు. ఆయన వయస్సు 69 ఏళ్ళు.. కొన్ని వారాలుగా డిప్రెషన్ తో ఆయన బాధపడుతున్నారని, బహుశా అందుకే సూసైడ్ చేసుకున్నారని పోలీసులు చెప్పారు. 2006..2008 మధ్య ఆయన హిమాచల్ ప్రదేశ్ డీజీపీగా , అంతకు ముందు రెండేళ్ల పాటు సీబీఐ డైరెక్టరుగా వ్యవహరించారు. మరిన్ని వివరాలు తెలియవలసి ఉంది.