Exclusive: ముఖేష్ అంబానీ కోసం ఆ పని కాంగ్రెస్ ఎందుకు చేసిందంటే.. అప్పటి క్యాబినెట్ సెక్రటరీ.. టీవీ9తో స్పెషల్ ఇంటర్వ్యూ..
యూపీఏ ప్రభుత్వంలో గ్యాస్ ధరలను నిర్ణయించేందుకు ఉపయోగించిన ఫార్ములా వల్ల ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీగా లాభపడిందని పెద్ద విషయం ఇప్పుడు..

అదానీ ఎదుగుదలకు బీజేపీ ప్రభుత్వం సాయం చేస్తోందనే వాదన మెున్నటి వరకు భారీగా వినిపించింది. అయితే అంబానీ, అదానీ వంటి కార్పొరేట్ల కోసమే కేంద్రంలోని ప్రభుత్వాలు పనిచేస్తుంటాయనే వాదనలు.. వార్తలు తరచుగా బయట వినిపిస్తూనే ఉంటాయి. అయితే ఇలాంటి సమయంలో ఒక బాంబు లాంటి మరిన్ని ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. యూపీఏ ప్రభుత్వంలో గ్యాస్ ధరలను నిర్ణయించేందుకు ఉపయోగించిన ఫార్ములా వల్ల ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీగా లాభపడిందని పెద్ద విషయం ఇప్పుడు మరోసారి చర్చకు దారితీసింది. అయితే ఈ విషయాన్ని వెల్లడించింది ఎవరో కాదు అప్పటి మాజీ క్యాబినెట్ సెక్రటరీ కేఎం చంద్రశేఖర్. ఆయన రాసిన “As Good As My Word: A Memoir” అనే పుస్తకం ఆధారంగా బీజేపీ తాజాగా దీనిపై తన వాదనను వెలుగులోకి తెచ్చింది. ఈ పుస్తకంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాల గురించి ఈ పుస్తకంలో వెళ్లడించారు.
అయితే, ” ఎస్ గుడ్ యస్ మై ఎ మెమోయిర్” పుస్తకంను కాంగ్రెస్ పార్టీని షేక్ చేసిన మాజీ క్యాబినెట్ సెక్రటరీ KM చంద్రశేఖర్ , TV9 తో ప్రత్యేకంగా మాట్లాడారు. మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో ఎలా అనుకూలంగా ఉందనే దాని గురించి లోతైన వివరాలను అందించారు. యూపీఏ హయాంలో గ్యాస్ ధరలను నిర్ణయించడంలో ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు అభిమానాన్ని ప్రదర్శించిందో తెలిపారు. ఈ సంచలన వాదనపై టీవీ 9 భారతవర్ష్ కేఎం చంద్రశేఖర్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు.
టీవీ 9 ప్రశ్న: గ్యాస్ ధర తగ్గించవచ్చని మీ పుస్తకంలో రాశారు. ప్రభుత్వం తక్కువ ధరకు గ్యాస్ కొనుగోలు చేయగలిగింది. అయితే కార్పొరేట్ సంస్థల నుంచి ఒత్తిడి వచ్చింది. అంబనీ సిఫార్సు ఆధారంగా ఎండార్స్‌మెంట్ ఇచ్చింది. ఆ తర్వాత గ్యాస్ ధర పెరిగి, ప్రభుత్వం పెరిగిన ధరకు గ్యాస్ కొనుగోలు చేసిందా..?
చంద్రశేఖర్ సమాధానం: ఆ సమయంలో నేను క్యాబినెట్ సెక్రటరీగా ఉన్నాను. అప్పుడే ఇదంతా మొదలైంది. ఒక నివేదిక తయారు చేయమని నన్ను అడిగారు. నేను దానిని పూర్తిగా చదివాను. కార్పొరేట్ హౌస్ రెండున్నర డాలర్లకు టెండర్ తీసుకున్నట్లు చూసింది. వారు ఒప్పందం కూడా చేసుకున్నారు. కానీ కొత్త ఫార్ములా తెరమీదికి వచ్చింది. పైగా నాలుగు డాలర్లు ఇచ్చి ఇలా చేయకూడదని చెప్పాను.
అసలు ఆ ఒప్పందం ఏంటి?
ప్రశ్న: సార్ ఏది ఒప్పందం? మీరు పుస్తకంలో దేని గురించి రాశారు? గ్యాస్ ఒప్పందంలో యూపీఏ ప్రభుత్వాన్ని ప్రభావితం చేసిన కార్పొరేట్ సంస్థ ఏది?
జవాబు: ఈ విషయం పుస్తకంలో వివరంగా చెప్పాను. ఇది ముఖేష్ అంబానీతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ ఒప్పందం.
కాబట్టి ఇప్పుడు ఈ వెల్లడి ఎందుకు?
కేఎం చంద్రశేఖర్ స్వయంగా కేబినెట్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఇన్నేళ్ల తర్వాత ఎందుకు ఈ విషయాలు బయటపెట్టారనేది ఇప్పుడు ప్రశ్న.
ప్రశ్న: మీరు రాసిన పుస్తకం, ఆ పుస్తకంలో చాలా వివాదాస్పద అంశాలు ఉన్నాయి. పుస్తకం రాసేటప్పుడు మీరు సంకోచించలేదా..? ఎందుకంటే మీరు ఆ సమయంలో క్యాబినెట్ సెక్రటరీగా ఉన్నారు. అన్ని అంశాలు మీ ముందు ఉన్నాయి.
జవాబు: నేను ఏది రాసినా తటస్థంగా రాశాను. రెండు ప్రభుత్వాల గురించి రాశాను. నేనేమీ వివాదాలు సృష్టించలేదని తెలిసీ ఇప్పుడే జరిగింది రాశాను. ఇంకెంత వివాదాస్పదం కావాలో అలా రాయలేదు. ఏం జరిగినా నిజమే చెప్పాలి. అందుకే వివరంగా రాయాల్సి వచ్చింది.
అసలు ఆ పుస్తకంలో ఏముందంటే..
దేశంలో గ్యాస్ ధరలను నిర్ణయించే ప్రక్రియలో చాలా తప్పులు జరిగాయని కేఎం చంద్రశేఖర్ తన పుస్తకంలో ఆ వివరాలను అందించారు. ముఖేష్ అంబాని గ్యాస్ ధర కోసం అటువంటి ఫార్ములాను ప్రభుత్వం ముందుకు తెచ్చారో తెలిపారు. ఆ సమయంలో ముడి చమురు రేటును పరిగణలోకి తీసుకుంటే.. గ్యాస్ ధర యూనిట్ కు 4.5 డాలర్ల కంటే ఎక్కువగా ఉంది. అదే సమయంలో అనిల్ అంబానీ పవర్ ప్లాంట్‌లకు 2.3 ఎంఎంబీటీయూ చొప్పున గ్యాస్ సరఫరా చేయడానికి అంగీకరించిన ఒప్పందం జరిగింది. అయితే ప్రభుత్వ ఎన్‌టీపీసీ టెండర్ ఆధారంగా యూనిట్‌కు 2.3 డాలర్లుగా రేటు నిర్ణయించబడిందని చంద్రశేఖర్ వెల్లడించారు. తర్వాత ఆ వ్యవహారం కోర్టుకు కూడా వెళ్లింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం