
అరె, ఫామ్-6నే మార్చేశారా? కొత్త ఓటుకే తూట్లు పొడిచేశారా? మాకే తెలీదే, మమ్మల్ని ఎవరూ అడగనేలేదే.. అని సుప్రీంకోర్టే బ్లాంక్‌ఫేస్ పెట్టేసింది. తమ అనుమతి లేకుండా ఎవరు ఎందుకు ఫామ్-6ని మార్చారో తేల్చేస్తాం అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ సీఈసీకి ఇన్‌డైరెక్ట్‌గా వార్నింగ్ కూడా ఇచ్చేశారు. సరిగ్గా ఇక్కడే అలర్ట్ ఐనట్టుంది టీమ్ అపోజిషన్. ఈ ఒక్క హింట్ చాలు.. ఇక రెచ్చిపోతా చూడు అన్నట్టుంది ఢిల్లీలో రాహుల్ దూకుడు. గాంధీగిరీ పేరుతో ఢిల్లీలో రాహుల్ కెప్టెన్సీలో ఇండీ కూటమి పెద్ద హల్‌చలే చేస్తోంది. ఫామ్ సిక్స్‌నే మెయిన్ ఎజెండాగా మార్చుకుని ప్లాన్ ఆఫ్ యాక్షన్ మార్చుకుని, మరింత ర్యాపిడ్‌గా దూసుకుపోతోంది విపక్ష కూటమి. కాకపోతే, ఫామ్ సిక్స్‌కి తోడుగా మరో సూపర్‌సిక్సర్ కూడా యాడైంది. ఏమిటది? అక్టోబర్ ఆరో తేదీన మొత్తం ఆరు డిమాండ్లతో పెద్ద వారే షురూ చేసింది ఇండీ కూటమి. డిమాండ్లు కాదు డైనమైట్లు, శక్తివంతమైన మందుపాతర్లు, పేలే తీరతాయి అని ఎన్‌డీఏ సర్కార్ మీద ఒత్తిడిని ఓ రేంజ్‌లో పెంచే ప్రయత్నంలో ఉంది అపోజిషన్ దండు. వన్‌మ్యాన్ షో నడిపించారన్న అభియోగాలు వచ్చీ రాగానే, CEC జ్ఞానేష్‌కుమార్ చుట్టూ అభిశంసన ఉచ్చు బిగిద్దామని మొదట్లో అనుకుంది. అది అంత...