Forced sex in marriage: దేశంలో ఇటీవల పలు న్యాయస్థానాల నుంచి సంచలన తీర్పులు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో ముంబై కోర్టు నుంచి కూడా సంచలన తీర్పు వెలువడింది. భార్యాభర్తల మధ్య బలవంతపు శృంగారం చట్టవిరుద్దం కాదని పేర్కొంటూ ముంబై అడిషనల్ సెషన్స్ జడ్జి సంజశ్రీ జే ఘరత్ సంచలన తీర్పు ఇచ్చారు. ఈ కేసు చట్టం ముందు నిలబడదంటూ ఆయన స్పష్టం చేశారు. నిందితుడు భర్త కావడం వల్ల అతను ఏదైనా చట్టవిరుద్ధమైన పనిచేశాడో లేదో చెప్పలేమని న్యాయమూర్తి వెల్లడించారు.
వివరాలు.. మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తితో మహిళకు గతేడాది నవంబర్ 22న వివాహమైంది. పెళ్లైన కొద్ది రోజులకు ఆమె భర్త, కుటుంబ సభ్యులు వరకట్న వేధింపులకు గురిచేస్తూ, ఆమెపై ఆంక్షలు విధించారంటూ ఆమె స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా వివాహమైన నెల రోజుల తర్వాత తన కోరికకు విరుద్ధంగా భర్త తనతో బలవంతంగా శృంగారం చేశాడని.. అతనిపై చర్యలు తీసుకోవాలంటూ బాధిత మహిళ ఫిర్యాదులో పేర్కొంది. జనవరి 2వ తేదీన మహాబలేశ్వర్‌కు వెళ్లగా.. అక్కడ తన భరత్త తనతో బలవంతంగా సెక్స్ చేసినట్లు ఆమె ఆరోపించింది. ఆతర్వాత తాను అనారోగ్యానికి గురికావడంతో వైద్యున్ని సంప్రదించినట్లు వెల్లడించింది. ఆమెను పరీక్షించిన డాక్టర్.. నడుము కింది భాగం పక్షవాతనాకి గురైనట్లు నిర్ధారించాడు.
అయితే.. తన భర్త బలవంతంగా శృంగారం చేయడంతోనే ఈ సమస్య వచ్చిందతీ.. ఆమె ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసు కోర్టుకు చేరడంతో విచారణ సందర్భంగా బాధితురాలు, ఆమె తరపు న్యాయవాది వాదనలను వినిపించారు. ఈ క్రమంలో దంపతుల మధ్య బలవంతపు శృంగారం చట్టం ముందు నిలబడదు అంటూ ధర్మాసనం తీర్పునిచ్చింది. కానీ ఆమె పక్షవాతానికి గురికావడం దురదృష్టకరం అంటూ జడ్జి సంజశ్రీ జే ఘరత్ పేర్కొన్నారు. ఈ కేసులో భర్తకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.
Also Read: