AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆప్‌కి మరో సెలబ్రేషన్.. కేజ్రీ భార్య బర్త్ డే నాడే పార్టీ విజయకేతనం

ఢిల్లీ ఎన్నికల్లో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆధ్వర్యంలోని ఆప్ కి మంగళవారం మరో సెలబ్రేషన్ రోజయింది.  ఓ వైపు పార్టీ విజయకేతనం వైపు దూసుకుపోతుండగా.. మరో వైపు ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ పుట్టినరోజు కూడా కావడంతో ఆ కుటుంబంతో బాటు పార్టీ నేతలు  కార్యకర్తల్లో సంబరాలు అంబరాన్నంటాయి. సునీత 54 వ ఏట అడుగుపెట్టిన రోజు కావడంతో.. అనేకమంది ట్విటర్ల ద్వారా ఆమెకు గ్రీటింగ్స్ తెలిపారు. కేజ్రీ రాజకీయాల్లోకి రాక ముందు  ఈ భార్యాభర్తలిద్దరూ ఇండియన్ […]

ఆప్‌కి మరో సెలబ్రేషన్.. కేజ్రీ భార్య బర్త్ డే నాడే పార్టీ విజయకేతనం
Umakanth Rao
| Edited By: |

Updated on: Feb 11, 2020 | 1:22 PM

Share

ఢిల్లీ ఎన్నికల్లో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆధ్వర్యంలోని ఆప్ కి మంగళవారం మరో సెలబ్రేషన్ రోజయింది.  ఓ వైపు పార్టీ విజయకేతనం వైపు దూసుకుపోతుండగా.. మరో వైపు ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ పుట్టినరోజు కూడా కావడంతో ఆ కుటుంబంతో బాటు పార్టీ నేతలు  కార్యకర్తల్లో సంబరాలు అంబరాన్నంటాయి. సునీత 54 వ ఏట అడుగుపెట్టిన రోజు కావడంతో.. అనేకమంది ట్విటర్ల ద్వారా ఆమెకు గ్రీటింగ్స్ తెలిపారు.

కేజ్రీ రాజకీయాల్లోకి రాక ముందు  ఈ భార్యాభర్తలిద్దరూ ఇండియన్ రెవెన్యూ సర్వీసు అధికారులు. గతవారం ఎన్నికల ఓటింగ్ రోజున ఓ పోలింగ్ కేంద్రం బయట తమ కుటుంబంతో దిగిన ఫోటోను సునీత పోస్ట్ చేశారు. ఎన్నికల్లో తన భర్త తరఫున ఆమె విస్తృత ప్రచారం చేశారు. కేజ్రీని బీజేపీ మంత్రులు, నేతలు టెర్రరిస్ట్ అని  ఆరోపించారని, అయితే ఈ ఎన్నికల్లో వారికి ఓటర్లు గట్టి బుధ్ది చెప్పారని ఆమె అన్నారు.’ మాకు వివాహమై పాతికేళ్ళు గడిచాయి. కానీ ఇప్పటికీ సమాజ సేవే తన లక్ష్యమని కేజ్రీవాల్ అంటుంటారు. ఆయనపై ఆరోపణలు చేస్తున్నవారికి   తాము అబధ్ధం చెబుతున్నామన్న విషయం తెలుసు.  అయితే ఎవరి ఒత్తిడితోనో వారు ఇలా మాట్లాడుతుండ వచ్చు’ అని  కూడా సునీత పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో ఆప్ మూడోసారి హ్యాట్రిక్ కొడుతుండడంతో ఈ పార్టీ కార్యాలయమంతా కార్యకర్తల కోలాహలంతో నిండిపోయింది. కార్యకర్తలు బాణా సంచా కాల్చరాదని కేజ్రీవాల్ సూచించడంతో వారంతా రంగురంగుల బెలూన్లు మాత్రం ఎగురవేసి ఒకరికొకరు గ్రీటింగ్స్ చెప్పుకున్నారు.

శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇక వాట్సాప్‌లో దర్శనం టిక్కెట్లు!
శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇక వాట్సాప్‌లో దర్శనం టిక్కెట్లు!
మీ కాలేయంలోని కొవ్వును వెన్నలా కరిగించే పానియం ఇది.. తయారీ ఇలా..
మీ కాలేయంలోని కొవ్వును వెన్నలా కరిగించే పానియం ఇది.. తయారీ ఇలా..
ప్రేమలో ఉన్న ప్రతి కుర్రాడు పాడుకునే ఏకైక సాంగ్..
ప్రేమలో ఉన్న ప్రతి కుర్రాడు పాడుకునే ఏకైక సాంగ్..
చిరంజీవి రిజెక్ట్ చేసిన కథతో పవన్ కల్యాణ్ సినిమా.. కట్ చేస్తే..
చిరంజీవి రిజెక్ట్ చేసిన కథతో పవన్ కల్యాణ్ సినిమా.. కట్ చేస్తే..
కష్టాల్లో ఉన్న భారత్‌ను ఆదుకున్న సూర్య..అమెరికా టార్గెట్ 162
కష్టాల్లో ఉన్న భారత్‌ను ఆదుకున్న సూర్య..అమెరికా టార్గెట్ 162
ఇదేం పిచ్చిరా బాబా.. రీల్‌ రీక్రియేట్ చేస్తుండగా జారీన ఛైర్..
ఇదేం పిచ్చిరా బాబా.. రీల్‌ రీక్రియేట్ చేస్తుండగా జారీన ఛైర్..
రోజూ ఓ గ్లాస్‌ రెడ్‌ వైన్‌ తాగితే గుండె ఆరోగ్యానికి మంచిదా?
రోజూ ఓ గ్లాస్‌ రెడ్‌ వైన్‌ తాగితే గుండె ఆరోగ్యానికి మంచిదా?
బెస్ట్‌ స్కీమ్‌- ప్రతిరోజూ రూ.333 ఆదా చేస్తే చేతికి రూ.17 లక్షలు!
బెస్ట్‌ స్కీమ్‌- ప్రతిరోజూ రూ.333 ఆదా చేస్తే చేతికి రూ.17 లక్షలు!
రాయల్ లుక్‌లో యంగ్‌ బ్యూటీ సారా అర్జున్‌.. మతిపోగొట్టేలా ఫోజులు!
రాయల్ లుక్‌లో యంగ్‌ బ్యూటీ సారా అర్జున్‌.. మతిపోగొట్టేలా ఫోజులు!
చీకట్లో మగ్గుతున్న గిరి పుత్రుల జీవితాల్లో వెలుగులు..!
చీకట్లో మగ్గుతున్న గిరి పుత్రుల జీవితాల్లో వెలుగులు..!