Food Inflation: పైపైకి కూరగాయలు, మసాలా దినుసుల ధరలు .. అన్నదాతలో ఆనందం, సామాన్యుడి జేబుకి చిల్లు

|

Jul 02, 2023 | 12:17 PM

హోల్‌సేల్ మార్కెట్‌లో కూడా జీలకర్ర కొనాలంటే ఆలోచించాల్సిదే అనిపిస్తుంది. చాలా ఖరీదైనది. కొనడానికి ముందు 10 సార్లు ఆలోచించేంత ధర పెరిగింది. దీంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. టమాటా, పచ్చి కూరలు మాత్రమే కాదు అల్లం, వెల్లుల్లి సహా అనేక వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. 

Food Inflation: పైపైకి కూరగాయలు, మసాలా దినుసుల ధరలు .. అన్నదాతలో ఆనందం, సామాన్యుడి జేబుకి చిల్లు
Vegetable Price Hike
Follow us on

రుతుపవనాలు ఆలస్యంతో ద్రవ్యోల్బణం తన అసలు స్వరూపం చూపించడం ప్రారంభించింది. కూరగాయలు మాత్రమే కాదు.. వంటింట్లో వాడే అనేక వస్తువులు ధరలు పై పైకి చేరుకున్నాయి. దీంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. టమాటా, పచ్చి కూరలు మాత్రమే కాదు అల్లం, వెల్లుల్లి సహా అనేక వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్ జిల్లాలో వెల్లుల్లి హోల్‌సేల్ రేటులో భారీగా నమోదైంది. దీంతో రిటైల్ మార్కెట్‌లోనూ వెల్లుల్లి ధర పెరిగింది. కిలో రూ.100 నుంచి 120 వరకు విక్రయించిన వెల్లుల్లి ధర ఇప్పుడు రిటైల్ మార్కెట్‌లో రూ. 200 లకు చేరుకుంది. అంతేకాదు వెల్లులి ధరలు రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని దుకాణదారులు చెబుతున్నారు. గతేడాది అధిక ఉత్పత్తి కారణంగా వెల్లుల్లి రేటు చాలా తక్కువగా ఉంది. రైతులకు కనీసం పెట్టిన పెట్టుబడి కూడా దక్కలేదు. అటువంటి పరిస్థితిలో  రైతులు అనేక వెల్లుల్లి బస్తాలను రోడ్లు, మండీల వెలుపల విసిరారు. ఇప్పుడు వెల్లుల్లి ధర పెరగడంతో అన్నదాత ఆనందంగా ఉన్నాడు.

అదే విధంగా అల్లం ధర కూడా భగభగమంటుంది. షాజాపూర్ జిల్లా రిటైల్ మార్కెట్‌లో కిలో రూ.120 నుంచి రూ.140 వరకు విక్రయించిన అల్లం ఇప్పుడు రూ.250కి చేరింది. అదేవిధంగా పచ్చిమిర్చి ధరలో కూడా భారీ మార్పులు చోటు చేసుకుంది. పచ్చిమిర్చి కిలో రూ.150కి చేరింది.

ఇవి కూడా చదవండి

జీలకర్ర హోల్‌సేల్ మార్కెట్‌లో కూడా చాలా ఖరీదైనది. కొనడానికి ముందు 10 సార్లు ఆలోచించేంత ధర పెరిగింది. దేశంలోని మండీల్లో జీలకర్ర ధర క్వింటాల్ రూ.58,000కి చేరుకుంది. కాగా, ఈ ఏడాది జనవరి నెల వరకు మార్కెట్‌లో జీలకర్ర క్వింటాల్‌కు రూ.35 వేలు పలికింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..