Dope Test: డీజీసీఏ కీలక నిర్ణయం.. ఇక నుంచి వారికి కూడా డోప్‌ టెస్ట్‌.. ఉత్తర్వులు జారీ

Random dope tests on flight crew: విమానాల్లో ప్రయాణించే వారికి తనిఖీలు నిర్వహించడం సాధారణమే. అయితే.. సిబ్బందికి కూడా మాదక ద్రవ్యాల పరీక్షలు చేసేందుకు ప్రభుత్వ సంస్థ

Dope Test: డీజీసీఏ కీలక నిర్ణయం.. ఇక నుంచి వారికి కూడా డోప్‌ టెస్ట్‌.. ఉత్తర్వులు జారీ
Flight Crew

Updated on: Sep 29, 2021 | 2:14 PM

Random dope tests on flight crew: విమానాల్లో ప్రయాణించే వారికి తనిఖీలు నిర్వహించడం సాధారణమే. అయితే.. సిబ్బందికి కూడా మాదక ద్రవ్యాల పరీక్షలు చేసేందుకు ప్రభుత్వ విమానయాన సంస్థ డీజీసీఏ నిర్ణయం తీసుకుంది. విమానాల్లో విధులు నిర్వహించే సిబ్బందికి, రాకపోకలను నియంత్రించే ఉద్యోగులకు వచ్చే ఏడాది జనవరి 31 నుంచి డోప్‌ పరీక్షలు చేయనున్నట్లు వెల్లడించింది. మనుషుల మానసిక, శారీరక పరిస్థితులపై ప్రభావం చూపించే గంజాయి, కొకెయిన్‌ వంటి మాదకద్రవ్యాలకు సిబ్బంది దూరంగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా డ్రగ్స్‌ వినియోగం విస్తరిస్తోందని.. ముఖ్యంగా విమానాల్లో ప్రయాణించేవారే పట్టుబడుతున్నారని అధికారులు వెల్లడించారు. విమానాల్లో వీటి వినియోగం, లభ్యత ప్రయాణికుల భద్రతపరంగా దీనిని తీవ్రంగా పరిగణించాల్సిన విషయంగా సివిల్ ఏవియేషన్ డైరెక్టరేట్ జనరల్ పేర్కొన్నారు.

ఈ మేరకు డీజీసీఏ చీఫ్‌ అరుణ్‌ కుమార్‌ ఉత్తర్వులను జారీ చేశారు. విమానాయన ఉద్యోగులందరికీ ఈ పరీక్షలు యథావిధిగా జరుగుతాయని పేర్కొన్నారు. ఒకవేళ ఉద్యోగులు ఈ పరీక్షలు చేయించుకునేందుకు నిరాకరిస్తే వారిని విధుల నుంచి తొలగిస్తారు. డోప్‌ పరీక్షల అనంతరం వారిని తిరిగి విధుల్లోకి తీసుకుంటారు. డోప్‌ పరీక్షల్లో పట్టుబడితే ఉద్యోగులను శాశ్వతంగా తొలగించే అవకాశముంది.

Also Read:

Empty Stomach: ఖాళీ కడుపుతో అస్సలు నిద్రపోకండి.. అలా చేస్తే అనారోగ్యం బారిన పడినట్లే.. ఎందుకంటే..?

Viral Video: ఈ జంట డ్యాన్స్ చూస్తే పడి పడి నవ్వాల్సిందే.. నడిరోడ్డుపై పోటా పోటిగా చిందులు.. ఇదేం స్టైల్..