సరిహద్దుల్లో హై టెన్షన్.. ఆర్మీ సంచలన ప్రకటన..!

| Edited By:

Oct 11, 2019 | 7:38 PM

ఆర్మీ ఉన్నతాధికారులు సంచలన ప్రకటన చేశారు. సరిహద్దుల్లో కాపుకాచుకుని 500 మంది ఉగ్రవాదులు ఉన్నట్లు తెలిపారు. ఏ క్షణంలోనైనా పీవోకే నుంచి కశ్మీర్‌లో చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కోన్నారు. ఆర్మీ ప్రకటనతో భద్రతా దళాలు, జమ్ముకశ్మీర్‌ పోలీసులు అప్రమత్తమయ్యారు. నియంత్రణా రేఖ వెంబడి అలజడి సృష్టించేందుకు దాదాపు రెండు నుంచి మూడు వందల మంది ఉగ్రవాదులు పాక్ సహకారంతో ప్రయత్నిస్తున్నారని ఆర్మీ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఇక జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవేట కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో దాదాపు మూడు వందల మంది […]

సరిహద్దుల్లో హై టెన్షన్.. ఆర్మీ సంచలన ప్రకటన..!
Follow us on

ఆర్మీ ఉన్నతాధికారులు సంచలన ప్రకటన చేశారు. సరిహద్దుల్లో కాపుకాచుకుని 500 మంది ఉగ్రవాదులు ఉన్నట్లు తెలిపారు. ఏ క్షణంలోనైనా పీవోకే నుంచి కశ్మీర్‌లో చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కోన్నారు. ఆర్మీ ప్రకటనతో భద్రతా దళాలు, జమ్ముకశ్మీర్‌ పోలీసులు అప్రమత్తమయ్యారు. నియంత్రణా రేఖ వెంబడి అలజడి సృష్టించేందుకు దాదాపు రెండు నుంచి మూడు వందల మంది ఉగ్రవాదులు పాక్ సహకారంతో ప్రయత్నిస్తున్నారని ఆర్మీ ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

ఇక జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవేట కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో దాదాపు మూడు వందల మంది ఉగ్రవాదులు స్థానిక తీవ్ర వాద సంస్థలతో కలిసి అలజడి సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని నార్తన్ కమాండ్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ రణవీర్ సింగ్ తెలిపారు. దాదాపు ఐదు వందల మంది తీవ్రవాదులు జమ్మూలో ప్రవేశించడానికి కాచుకొని కూర్చొన్నారని, అయితే వారి వారి శిక్షణా సమయాన్ని బట్టి ఈ సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉందని ఆయన పేర్కొన్నారు. ఉగ్రవాదులు ఎందరొచ్చినా.. వారిని మట్టుబెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని రణవీర్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు.

కాగా, ఆగస్ట్ 5వ తేదీన ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే.