జమ్ముకశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరగడంతో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.జమ్ముకశ్మీర్‌లోని ఇండో-పాక్ సరిహద్దు నియంత్రణ రేఖకు ఆనుకుని ఉన్న కుప్వారా జిల్లా సమీపంలో భద్రతాదళాలు.. ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. జమ్ముకశ్మీర్ పోలీసులు, ఆర్మీ సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో ఐదుగురు పాక్ ఉగ్రవాదులు హతమయ్యారు. సైన్యం, జమ్ముకశ్మీర్ పోలీసులు ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సెర్చ్ ఆపరేషన్లో, ఉగ్రవాదులు వారిపై కాల్పులు జరిపారు. భద్రతా సంస్థలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు పాక్ ఉగ్రవాదులు హతమయ్యారు.
జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో గురువారం (జూన్ 15) ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాన్ని సైన్యం విఫలం చేసింది. నియంత్రణ రేఖ సమీపంలో పెద్ద సంఖ్యలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకుంది సైన్యం. కృష్ణా ఘాటి సెక్టార్‌లో సెర్చ్ ఆపరేషన్‌లో ఈ రికవరీ జరిగిందని.. ఇందులో పాకిస్తాన్‌లో తయారైన స్టీల్ కోర్ కాట్రిడ్జ్‌లు, మందులు కూడా ఉన్నాయని అధికారులు తెలిపారు.
నిఘా వర్గాలు అందించిన సమాచారం ఆధారంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించనట్లుగా ఆర్మీ అధికారులు తెలిపారు. ఈ సమయంలో రెండు బ్యాగుల్లో ఒక ఏకే-47 రైఫిల్, తొమ్మిది మ్యాగజైన్లు, 438 కాట్రిడ్జ్‌లు, రెండు లభించాయని వెల్లడించారు. నాలుగు మ్యాగజైన్‌లతో కూడిన మ్యాగజైన్‌లు లభించాయని..ఒక పిస్టల్, ఆరు గ్రెనేడ్‌లు కాకుండా కొన్ని బట్టలు, మందులు ఉన్నాయన్నారు. లెఫ్టినెంట్ కల్నల్ ఆనంద్ మాట్లాడుతూ.. ఈ త్వరిత చర్యతో, మరొక చొరబాటు ప్రయత్నం విఫలమైందని, దీని కారణంగా పూంచ్ జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతాన్న అడ్డుకున్నామని తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం