విషాదం.. సెప్టిక్‌ ట్యాంకులో పడి ఐదుగురు మృతి.. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం

|

Mar 17, 2021 | 11:20 AM

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. ఫతేబాద్‌ తహసీల్‌ పరిధిలోని ఓ గ్రామంలో సెప్టిక్‌ ట్యాంకులో పడి ఐదుగురు మరణించారు. అయితే ఆడుకుంటూ వెళ్లిన ..

విషాదం.. సెప్టిక్‌ ట్యాంకులో పడి ఐదుగురు మృతి.. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం
Follow us on

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. ఆగ్రాలోని ఫతేబాద్‌ తహసీల్‌ పరిధిలోని ఓ గ్రామంలో సెప్టిక్‌ ట్యాంకులో పడి ఐదుగురు మరణించారు. అయితే ఆడుకుంటూ వెళ్లిన ఓ బాలుడు ప్రమాదవశాత్తు సెప్టిక్‌ ట్యాంకులో పడిపోగా, బాలుడిని కాపాడేందుకు ప్రయత్నించిన మరో నలుగురు మృతి చెందారు. కాగా, ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సోదరులు సహా ఐదుగురు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. స్థానికుల సమాచారం మేరకు ప్రతాప్‌పురా గ్రామంలో అనురాగ్‌ (10) అనే బాలుడు ఇంటి ముందు ఆడుకుంటున్నాడు. ఇదే క్రమంలో బాలుడు ప్రమాదవశాత్తు సెప్టిక్‌ ట్యాంక్‌లో పడిపోయాడు. వెంటనే గమనించిన మరో ముగ్గురు హరిమోహన్‌ (17), అవినాష్‌ (12), సోనూ (25) సహా నలుగురు ట్యాంకులో దిగారు.

దీంతో వారంతా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఇక వీరిని రక్షించే ప్రయత్నం చేసిన యోగేష్‌ అనే మరో వ్యక్తి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. గ్రామస్తులు వారిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అనురాగ్‌ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అలాగే మిగతా నలుగురిని ఎస్‌ఎన్‌ మెడికల్‌ కాలేజీకి తరలిస్తుండగా, వారు కూడా మృతి చెందారు. మృతుల్లో హరిమోహన్‌, అవినాష్‌, అనురాగ్‌ సోదరులు. ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.