Lord Vishnu: నడిసముద్రంలో ‘నారాయణుడు’.. అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోయిన మత్స్యకారులు..
మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లడం, వారి వలలకు చేపలు చిక్కడం సహజం. కొన్ని సందర్భాల్లో అరుదైన చేపలు చిక్కడంతో వారి ముఖంలో ఆనందం వెల్లివిరుస్తుంది. అలాంటి ఘటనలు మనం ఎన్నో చూశాం. అయితే, ఇప్పుడు మాత్రం అంతకు మించిన సీన్ అని చెప్పాలి.
మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లడం, వారి వలలకు చేపలు చిక్కడం సహజం. కొన్ని సందర్భాల్లో అరుదైన చేపలు చిక్కడంతో వారి ముఖంలో ఆనందం వెల్లివిరుస్తుంది. అలాంటి ఘటనలు మనం ఎన్నో చూశాం. అయితే, ఇప్పుడు మాత్రం అంతకు మించిన సీన్ అని చెప్పాలి. మత్స్యకారుల వలకు ఈసారి చిక్కింది చేప కదు. మత్స్యావతారుడైన నారయణుడు చిక్కాడు. అవును, నడి సంద్రంలో నారాయణుడి విగ్రహం లభించింది. అది చూసి మత్స్యకారులు షాక్ అయ్యారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
సముద్రంలో మత్స్యకారులు చేపల వేట వెళ్లారు. చేపల కోసం వల వేశారు. ఆ వలలో చిక్కిన చేపల్ని బయటకు తీస్తుండగా నారాయణుడి ముఖ భాగం కనిపించింది. అది చూసి షాకయ్యారంతా. ఏంటీ దేవుడి మహిమ అంటూ రెండు చేతులు జోడించి మొక్కడం షురూ చేశారు.
తమిళనాడులోని చిన్నకాల్పట్టు గ్రామానికి చెందిన కొంతమంది మత్స్యకారులు.. పుదుచ్చేరి నడి సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. అయితే వలకు దేవుడి విగ్రహం చిక్కడంతో ఆశ్చర్యానికి గురయ్యారు. విగ్రహాన్ని చూసేందుకు స్థానికులు క్యూ కట్టారు. మరోవైపు పురావస్తు శాఖ అధికారులకు మత్స్యకారులు సమాచారమిచ్చారు. సముద్రంలో స్వామి విగ్రహం దొరకడంపై మరింత లోతుగా ఆరాతీస్తున్నారు అధికారులు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..