Bullet Bike: బుల్లెట్ బండి ఇవ్వలేదని పెళ్లి క్యాన్సిల్.. ఇదేం విడ్డురం.
ఉత్తరప్రదేశ్‌లోని నౌరంగాబాద్ కు చెందిన మోతీలాల్ తన కుమార్తె వివాహం పక్క గ్రామానికి చెందిన మున్నా సింగ్ కుమారుడు బాదల్ తో నిశ్చయించాడు. జూన్ 18న ముహూర్తం పెట్టుకున్నారు. వివాహం ఘనంగా జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.
ఉత్తరప్రదేశ్‌లోని నౌరంగాబాద్ కు చెందిన మోతీలాల్ తన కుమార్తె వివాహం పక్క గ్రామానికి చెందిన మున్నా సింగ్ కుమారుడు బాదల్ తో నిశ్చయించాడు. జూన్ 18న ముహూర్తం పెట్టుకున్నారు. వివాహం ఘనంగా జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. అనుకున్నట్లుగానే ఆ రోజున మగ పెండ్లివారు ఊరేగింపుగా పెండ్లి మండపానికి చేరుకున్నారు. వారికి వధువు బంధువులు ఘనంగా స్వాగతం పలికారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఆ తర్వాతే అసలు కథ మొదలైంది.
పెళ్లి తంతు మొదలయ్యే సమయానికి మగ పెళ్లివారు అదనపు కట్నం కోసం డిమాండ్ చేశారు. కట్నంగా బుల్లెట్ బండితో పాటు మరో లక్ష క్యాష్ ఇస్తేనే తాళి కడతానని పెళ్లి కొడుకు బీష్మించుకు కూర్చున్నాడు. ఆడపెళ్లి వారు ఎంత నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. అయితే వరుడు కోరినవి ఇవ్వలేమని వధువు తల్లిదండ్రులు చెప్పడంతో మగపెళ్లివారు తిరిగి వెళ్లిపోయారు. పెళ్లి చేసుకోకుండానే మగ పెళ్లివారు వెనుదిరగడంతో వధువు తండ్రి మోతీలాల్ వారిపై రూరా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. బుల్లెట్ బండితో పాటు లక్ష నగదు ఇవ్వాలని డిమాండ్ చేశారని అందులో రాశాడు. మోతీలాల్ కంప్లైంట్ ఆధారంగా కేసు బుక్ చేసిన పోలీసులు పెళ్లికొడుకు బాదల్, అతని తండ్రితో పాటు మరో 50 మందిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

