వ్యాక్సిన్ తీసుకున్న బికనీర్ మహిళకు డెల్టా ప్లస్ వేరియంట్… రాజస్తాన్ లో తొలి కేసు…

| Edited By: Phani CH

Jun 27, 2021 | 4:34 PM

రాజస్తాన్ లోని బికనీర్ లో రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న మహిళకు డెల్టా ప్లస్ సోకింది. జీనోమ్ సీక్వెన్సింగ్ కి గాను ఆమెకు సంబంధించిన శాంపిల్స్ ను పూణే లోని వైరాలజీ సంస్థకు గతంలోనే పంపారు.

వ్యాక్సిన్ తీసుకున్న బికనీర్ మహిళకు డెల్టా ప్లస్ వేరియంట్... రాజస్తాన్ లో తొలి కేసు...
First Delta Plus Case
Follow us on

రాజస్తాన్ లోని బికనీర్ లో రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న మహిళకు డెల్టా ప్లస్ సోకింది. జీనోమ్ సీక్వెన్సింగ్ కి గాను ఆమెకు సంబంధించిన శాంపిల్స్ ను పూణే లోని వైరాలజీ సంస్థకు గతంలోనే పంపారు. ఆ రి[పోర్టు శనివారం అందిందని బికనీర్ వైద్య అధికారులు తెలిపారు. కోవిద్ నుంచి ఆమె ఇదివరకే కోలుకుందని, ఈ శాంపిల్స్ లో ఈ వేరియంట్ ను కనుగొన్నామని వారు చెప్పారు. కోవిద్ నుంచి ఆమె ఇదివరకే కోలుకుందన్నారు. రాష్ట్రంలో ఇదే మొదటి డెల్టా ప్లస్ కేసు అని.. 65 ఏళ్ళ ఈ మహిళ ఎసింప్టొమాటిక్ అని వారు పేర్కొన్నారు. ఈ మహిళ ఆరోగ్యంగానే కనిపిస్తోందన్నారు. కానీ ముందు జాగ్రత్త చర్యగా ఈమె ఇంటి చుట్టూ మైక్రో కంటెయిన్మెంట్ జోన్ ను ఏర్పాటు చేశారు. పైగా కాంటాక్ట్ ట్రేసింగ్ ప్రక్రియను కూడా ప్రారంభించారు. ఈమె ఇంటి సమీపంలో 41 మందికి ఇన్ ఫ్లూయెంజా వంటి వైరస్ సోకిందని, లోగడ వీరు కరోనా వైరస్ పాజిటివ్ కి గురయ్యారని, వీరందరికీ మళ్ళీ టెస్టులు నిర్వహిస్తారని తెలుస్తోంది. ఇలాంటి వైరస్ ను తాము కనుగొనడం ఇదే మొదటిసారని అధికారులు తెలిపారు.

అటు రాజస్థాన్ లో గత 24 గంటల్లో 140 కి పైగా కోవిద్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు సుమారు 9 వేలమంది రోగులు మరణించారు. 1873 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ఒక వైపు కోవిద్ కేసులు తగ్గుతున్నప్పటికీ మరణాల సంఖ్య పెరగడం అధికారులకు ఆందోళన కలిగిస్తోంది. తొలి డెల్టా ప్లస్ కేసు కూడా వెలుగులోకి రావడంతో వీరు మరింత కలవరం చెందుతున్నారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Drone Attack: భారత్‌పై తొలి డ్రోన్ దాడి.. వాయుసేన స్థావరాలను టార్గెట్ చేసిన ముష్కరులు

రూ. 50 కోట్లతో అంబేద్కర్ స్మారక మందిరం…. 45 మీటర్ల ఎత్తులో శిలా విగ్రహం… యూపీ ప్రభుత్వ యోచన