AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రూ. 50 కోట్లతో అంబేద్కర్ స్మారక మందిరం…. 45 మీటర్ల ఎత్తులో శిలా విగ్రహం… యూపీ ప్రభుత్వ యోచన

ఉత్తరప్రదేశ్ లో రూ. 50 కోట్ల వ్యయంతో డా.బీ.ఆర్. అంబేద్కర్ స్మారక మందిరాన్ని నిర్మించాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం నిర్ణయించింది.

రూ. 50 కోట్లతో అంబేద్కర్ స్మారక మందిరం.... 45 మీటర్ల ఎత్తులో శిలా విగ్రహం... యూపీ  ప్రభుత్వ యోచన
Yogi Adityanath
Umakanth Rao
| Edited By: |

Updated on: Jun 27, 2021 | 4:25 PM

Share

ఉత్తరప్రదేశ్ లో రూ. 50 కోట్ల వ్యయంతో డా.బీ.ఆర్. అంబేద్కర్ స్మారక మందిరాన్ని నిర్మించాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం నిర్ణయించింది. లక్నోలోని ఐషా బాగ్ లో దీనికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సోమవారం శంకు స్థాపన చేసే అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఏడాది జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల ముందే రాష్ట్రంలో దళితులకు మరింత చేరువ కావాలన్న ఉద్దేశంతో ఈ భారీ ప్రాజెక్టుకు ప్రభుత్వం శీకారం చుట్టినట్టు తెలుస్తోంది. ఈ మెమోరియల్ లో 45 మీటర్ల ఎత్తయిన అంబేద్కర్ శిలా విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు. రానున్న డిసెంబరు మొదటివారానికి ఇది [పూర్తి కావచ్చునని భావిస్తున్నారు. డిసెంబరు 6 న అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని సీఎం యోగి ఆదిత్యనాథ్. ఈ శిలా విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. లక్నో, నొయిడాలలో లోగడ బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి హయాంలో అంబేద్కర్ కి సంబంధించిన పలు మెమోరియల్స్ ను ఏర్పాటు చేశారు. కానీ వాటికీ భిన్నంగా ఈ మెమోరియల్ ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ నూతన స్మారక మందిరంలో సాంస్కృతిక, విద్యా సంబంధమైన ఈవెంట్లు, కార్యక్రమాలు కూడా జరుగుతాయని ఈ వర్గాలు పేర్కొన్నాయి.

20 అడుగుల ఎత్తున నిర్మించే పీఠికపై అంబేద్కర్ శిలా విగ్రహాన్ని ప్రతిష్టిస్తారని తెలియవచ్చింది. గతంలోనే ఈ ప్రతిపాదన చేసినా.. తాజాగా దీనికి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ యూపీలో మూడు రోజులు పర్యటించనున్నారు. ఈ రాష్ట్రంలోని తన జన్మ స్థలాన్ని ఆయన విజిట్ చేయనున్నారు. ఈ సందర్బంగా ఆయన ఆదివారం రైల్లో ప్రయాణించడం విశేషం.

మరిన్ని ఇక్కడ చూడండి: యూకేలో మాజీ భార్యకు వాటా ఇవ్వాల్సివస్తుందని ఇల్లు తగులబెట్టుకున్నాడు… కోర్టు ఏ శిక్ష విధిస్తుందో..?

Vaccine Certificate: విదేశాల‌కు వెళ్లే వారికి ముఖ్య గ‌మనిక‌.. వ్యాక్సిన్ స‌ర్టిఫికేట్ త‌ప్ప‌నిస‌రి. ఎలా పొందాలంటే..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!