
ముంబై, జనవరి 22: దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో నిర్మించిన అతిపెద్ద అటల్ సేతు ఫ్లై ఓవర్ పై రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలు, చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. ఇదే ఈ వంతెనపై జరిగిన మొదటి ప్రమాదం. సంఘటనను ఒక వ్యక్తి తన కారులో నుంచి వీడియో తీశారు. యాక్సిడెంట్ చోటు చేసుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడి పరిస్థితిని పర్యవేక్షించారు. గాయపడిన వారిని ముంబై ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు ట్రాఫిక్ పోలీసులు. వంతెనపై వరుసగా వెళ్తున్న వాహనాల మధ్య నుంచి మరో కారును దాటేందుకు ప్రయత్నించిన క్రమంలో అదుపుతప్పి రెయిలింగ్ ను ఢీ కొట్టినట్లు గుర్తించారు. దీంతో కారు స్పీడ్ కంట్రోల్ అయ్యే లోపే పల్టీలు కొట్టింది. అయితే ఈ ప్రమాదానికి గురైన వారు ముంబయి నుంచి రాయ్‌గఢ్ జిల్లాలోని చిర్లేకు వెళుతున్నట్లు చెబుతున్నారు పోలీసులు. కారు స్పీడు మరింత ఎక్కువగా ఉండి ఉంటే వాహనం సముద్రంలో పడేదని ఈ సంఘటనను చూసిన వారు చెబుతున్నారు.
ముంబయిలోని సేవ్రీ నుంచి రాయ్‌గఢ్ జిల్లాలోని నవశేవాను కలుపుతూ అటల్ సేతు వంతెనను నిర్మించించారు. ఇది జనవరి 12న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించబడింది. ఈ నిర్మాణం రెండు ప్రాంతాల మధ్య దూరాన్ని గంటన్నర నుంచి 20 నిమిషాలకు తగ్గించింది. ఆరు లేన్లుగా నిర్మించిన ఈ వంతెనపై గరిష్ఠ వేగం 100 కి.మీ.లు కాగా, కనిష్ఠ వేగం 40 కి.మీ.లుగా నిర్దేశించారు అధికారులు. ద్విచక్ర వాహనాలు, ఆటోలకు అనుమతి లేదు. దీని మొత్తం పొడవు 21.8 కి.మీ.లు కాగా..16 కి.మీ.లకు పైగా అరేబియా సముద్రంపైనే ఉండటం విశేషం. ఈ వంతెనను భూకంపా తీవ్రతను తట్టుకునేదిగా నిర్మించారు. అలాగే అత్యంత అధునాతనమైన సాంకేతికతను ఉపయోగించారు. సముద్రంలో నివసించే జీవులకు కూడా ఎలాంటి హాని కలుగకుండా నిర్మించారు. సోలార్ ద్వారా లైటింగ్ అందించేలా పనులు చేపట్టారు. ఫాస్టాగ్ టోల్ రుసుమును ఆగి చెల్లించనవసరం లేకుండా అటోమేటిక్ సెన్సార్లను అమర్చారు. ఇంత గొప్ప ఫీచర్లు ఉన్న ఈ వంతెనపై తొలి ప్రమాదం సంభవించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. భవిష్యత్తులో ఏమైనా సరికొత్త రూల్స్ తీసుకొస్తారా లేక ఇప్పుడున్న 100 కి.మీ స్పీడ్ ను కొనసాగిస్తారా వేచి చూడాలి.
See the visuals Recorded in Camera.. Accident Occurred on Atal Sethu Fly over…
Speed Limit To be maintained by Roads and Transportation Department.. The car Which was Going With Over speed in a Deadliest way… Luckily They were out of Danger.. #AtalSetu #Mumbai pic.twitter.com/NsHxYzSDCy— LadduTweets (@LadduTweets) January 22, 2024
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..