Airport: కోల్‌కతాలోని ఎయిర్‌పోర్టులో అగ్నిప్రమాదం.. భయంతో పరుగులు తీసిన ప్రయాణికులు

కోల్‌కతాలోని సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఏయిర్‌పోర్టులో అగ్నిప్రమాదం జరగడం కలకలం రేపింది. బుధవారి రాత్రి 9.20 PM గంటలకు ఎయిర్‌పోర్టులోని 3 సీ డిపార్చర్ టర్మినల్ బిల్డింగ్ వద్ద వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో వెంటనే ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు.

Airport: కోల్‌కతాలోని ఎయిర్‌పోర్టులో అగ్నిప్రమాదం.. భయంతో పరుగులు తీసిన ప్రయాణికులు
Fire In Airport

Updated on: Jun 15, 2023 | 9:11 AM

కోల్‌కతాలోని సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఏయిర్‌పోర్టులో అగ్నిప్రమాదం జరగడం కలకలం రేపింది. బుధవారి రాత్రి 9.20 PM గంటలకు ఎయిర్‌పోర్టులోని 3 సీ డిపార్చర్ టర్మినల్ బిల్డింగ్ వద్ద వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో వెంటనే ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. దట్టమైన పొగ ఎయిర్‌పోర్టు ప్రాంగణాన్ని కమ్మేసింది. సమాచారం తెలుసుకున్న భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. రెండు అగ్నిమాపక శకటాలు ఘటన స్థలానికి చేరుకున్నాయి. దాదాపు 20 నిమిషాల పాటు సిబ్బంది శ్రమించి మంటలను పూర్తిగా ఆర్పేశారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు ఎయిర్‌పోర్టు అధికారులు అనుమానిస్తున్నారు.

అయితే ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎలాంటి నష్టం జరగలేదు. అధికారులు ఆ ప్రయాణికులని సురక్షిత ప్రాంతానికి తరలించారు. అయితే మొదటగా లగేజ్‌లు వచ్చే కన్వేయర్ బెల్టుకు దగ్గర్లో మంటలు వచ్చాయని పలువురు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ప్రమాదం ఎలా జరిగిందో అన్న విషయానికి సంబంధించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి