Delhi Fire: రెస్టారెంట్‌లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. ఆ పక్కనే బ్యాంకులు, ఏటీఎంలు..

|

Jul 15, 2022 | 11:18 AM

పైకప్పు నుంచి పొగలు రావడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే ఆరు అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. అప్పటికి పైకప్పు నుంచి మంటలు..

Delhi Fire: రెస్టారెంట్‌లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. ఆ పక్కనే బ్యాంకులు, ఏటీఎంలు..
representative image
Follow us on

Delhi Fire: దేశ రాజధానిలో తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఢిల్లీలోని అత్యంత ప్రసిద్ధ ప్రాంతాల్లో ఒకటైన కన్నాట్ ప్లేస్‌లోని ఓ రెస్టారెంట్‌లో మంటలు చెలరేగాయి. వెంటనే 6 ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటలు విస్తృతంగా వ్యాపించినప్పటికీ, ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు, అయితే ఒక వ్యక్తి గాయపడినట్లు సమాచారం. అగ్నిమాపక శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం 5:30 గంటల ప్రాంతంలో కన్నాట్ ప్లేస్‌లోని ఓ రెస్టారెంట్‌లో మంటలు చెలరేగాయి. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయి.

స్థానిక సమాచారం ప్రకారం.. ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ ఔటర్ సర్కిల్‌లోని కేఫ్ హై-5లో ఈ ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. పైకప్పు నుంచి పొగలు రావడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే ఆరు అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. అప్పటికి పైకప్పు నుంచి మంటలు రావడం ప్రారంభించాయి. అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలను ఆర్పడం ప్రారంభించారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు దాదాపు మూడున్నర నుంచి నాలుగు గంటల సమయం పట్టింది. ఈ మంటల్లో ఒకరు గాయపడినట్లు సమాచారం. అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.

ఇవి కూడా చదవండి

ఢిల్లీ అగ్నిమాపక శాఖ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ఉదయం 5:32 గంటలకు కన్నాట్ ప్లేస్ ఔటర్ సర్కిల్‌లో ఉన్న రెస్టారెంట్‌లో అగ్నిప్రమాదం గురించి తమకు సమాచారం అందిందని చెప్పారు. వెంటనే ఆరు ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. ప్రాథమిక విచారణ అనంతరం రెస్టారెంట్‌లోని కొన్ని ఫర్నీచర్‌ నుంచి మంటలు చెలరేగినట్లు భావిస్తున్నారు. మొదటి అంతస్తులో ఉన్న రెస్టారెంట్ ఇంటీరియర్ చాలా దెబ్బతిందని చెబుతున్నారు. రెస్టారెంట్ ప్రవేశ ద్వారం కూడా చాలా ఇరుకైనది. కానీ అది కన్నాట్ ప్లేస్ ఔటర్ సర్కిల్ కావడం, పార్కింగ్‌కు ఎదురుగా రెస్టారెంట్ ఉండడంతో అగ్నిమాపక దళం నిచ్చెనల సహాయంతో బయటి నుంచి మంటలను ఆర్పడం ప్రారంభించింది.

రెస్టారెంట్ పక్కనే రెండు ప్రభుత్వరంగ బ్యాంకులు, వాటి ఏటీఎంలు ఉన్నాయని తెలిసింది. మంటలు దిగువకు చేరినట్లయితే భారీ నష్టం జరిగే అవకాశం ఉందని అంతా భయపడిపోయారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి