Rahul Gandhi: న్యాయవాది ఫిర్యాదు… రాహుల్ గాంధీపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు

|

Aug 05, 2021 | 12:59 PM

Delhi Rape Murder Case: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీపై ఢిల్లీ‌ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఢిల్లీలో అత్యాచారం, హత్యకు గురైన 9 ఏళ్ల బాలిక కుటుంబ సభ్యుల వివరాలను బహిర్గతం చేసిన..

Rahul Gandhi: న్యాయవాది ఫిర్యాదు... రాహుల్ గాంధీపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు
Rahul Gandhi
Follow us on

Rahul Gandhi: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీపై ఢిల్లీ‌ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఢిల్లీలో అత్యాచారం, హత్యకు గురైన 9 ఏళ్ల బాలిక కుటుంబ సభ్యుల వివరాలను బహిర్గతం చేసిన రాహుల్ గాంధీపై చర్యలు తీసుకోవాలని న్యాయవాది వినీత్ జిందాల్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. అత్యాచార బాధితులు, వారి కుటుంబీకుల వివరాలను వెల్లడించకూడదన్న పోస్కో చట్టం, జువెనైల్ జస్టిస్ యాక్ట్‌లోనే పలు సెక్షన్లను రాహుల్ గాంధీ ఉల్లంఘించారని తన ఫిర్యాదులో న్యాయవాది ఆరోపించారు. న్యాయవాది ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదుచేశారు.

ఢిల్లీ హత్యాచార ఘటనలో బాధితురాలి కుటుంబ సభ్యులను బుధవారం ఉదయం వారి ఇంటికెళ్లి రాహుల్ గాంధీ ఓదార్చడం తెలిసిందే. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. బాధితురాలి కుటుంబానికి న్యాయం జరిగే వరకు వారికి అండగా నిలుస్తానని భరోసా ఇచ్చారు. అత్యాచారం, హత్యకు గురైన 9 ఏళ్ల చిన్నారి కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న ఫోటోలను రాహుల్ గాంధీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయడం వివాదాస్పదమవుతోంది. హత్యాచార ఘటనలో బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యుల వివరాలను రాహుల్ గాంధీ బహిర్గతం చేయడం సరికాదని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా మండిపడ్డారు. పోస్కో యాక్ట్, జువెనైల్ జస్టిస్ యాక్ట్‌లోని పలు సెక్షన్లను రాహుల్ ఉల్లంఘించారని ఆరోపించారు. రాహుల్ గాంధీపై కఠిన చర్యలు తీసుకోవాలని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ను డిమాండ్ చేశారు. పోస్కో చట్టం ముందు అందరూ సమానమేనని…ఎవరూ వీఐపీ కాదన్నారు. తాను చేసిన తప్పుకు రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలన్నారు. తప్పు చేస్తున్నట్లు తెలిసి కూడా బాధితురాలి కుటుంబ సభ్యుల వివరాలను రాజకీయ స్వార్థంతోనే రాహుల్ ఉద్దేశపూర్వకంగా బహిర్గతం చేశారని ఆరోపించారు. ఢిల్లీ హత్యాచార ఘటనను తన రాజకీయ అజెండా కోసం వాడుకోవాలని రాహుల్ గాంధీ చూస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.

అటు హత్యాచార బాధితురాలి కుటుంబ సభ్యుల ఫోటోలను రాహుల్ గాంధీ ట్విట్టర్‌లో పోస్ట్ చేయడంపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సీరియస్ అయ్యింది. అత్యాచార బాధితురాలి కుటుంబ సభ్యులను బహిర్గతం చేయడం ద్వారా రాహుల్ గాంధీ పోస్కో యాక్ట్ ఉల్లంఘనకు పాల్పడినట్లు ఆరోపించింది. ఈ వ్యవహారంలో ట్విట్టర్‌కు కూడా నోటీసులు జారీ చేసింది.

శ్మశానవాటికలో కాటికాపరులే మైనర్ బాలికను రేప్ చేసి హతమార్చినట్లు ఆ చిన్నారి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అందుకే తమ ఆమోదం లేకుండానే బాలిక మృతదేహానికి హడావుడిగా అంత్యక్రియలు నిర్వహించారని ఆరోపిస్తున్నారు. దీనికి కారకులైన వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీ హత్యాచార ఘటనపై దేశ వ్యాప్తంగానూ నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

Also Read..

బ్రతుకున్న పామును కరకరా నమిలి మింగేసిన యువకుడు.. కారణం తెలిస్తే షాకే.!

ఆ చేప నోట్లో మనిషి ‘పళ్ళు’..అమెరికాలోని జాలరికి లభించిన అరుదైన మత్స్యం