Swiss Banks : స్విస్ బ్యాంకులో భారతీయల సంపదపై కేంద్ర ఆర్థిక‌ మంత్రిత్వ‌శాఖ‌ కీలక వ్యాఖ్యలు, ఇదీ సంగతంటూ వివరణ

భార‌తీయులు స్విస్ బ్యాంకుల్లో గ‌త 13 ఏళ్ల‌తో పోలిస్తే రికార్డు స్థాయిలో 2020వ సంవత్సరంలో డిపాజిట్లు చేసిన‌ట్లు ఇటీవల వచ్చిన వార్తల్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ‌శాఖ..

Swiss Banks : స్విస్ బ్యాంకులో భారతీయల సంపదపై కేంద్ర ఆర్థిక‌ మంత్రిత్వ‌శాఖ‌ కీలక వ్యాఖ్యలు, ఇదీ సంగతంటూ వివరణ
Swiss Bank Money

Updated on: Jun 19, 2021 | 11:20 PM

Black Money Held By Indians In Swiss Banks fact check : భార‌తీయులు స్విస్ బ్యాంకుల్లో గ‌త 13 ఏళ్ల‌తో పోలిస్తే రికార్డు స్థాయిలో 2020వ సంవత్సరంలో డిపాజిట్లు చేసిన‌ట్లు ఇటీవల వచ్చిన వార్తల్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ‌శాఖ ఖండించింది. అది కేవ‌లం స్విట్జ‌ర్లాండ్‌లో దాచుకున్న భార‌తీయుల సొమ్ము కాదని వెల్లడించింది. ఇదే క్రమంలో 2019 నుంచి స్విస్ బ్యాంకుల్లో డిపాజిట్లు త‌గ్గిన‌ట్లు కేంద్ర ఆర్థిక శాఖ చెప్పింది. అయితే స్విస్ బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసిన భార‌తీయల సమాచారాన్ని సేక‌రిస్తున్నట్లు ఆర్థిక మంత్రిత్వ‌శాఖ కార్యాల‌యం తెలిపింది.

అంతేకాదు, తప్పుగా వచ్చిన సదరు వార్తలో అసలు విషయం ఏంటన్నది వివరించే ప్రయత్నం చేసింది. ‘2019లో స్విస్‌ బ్యాంకుల్లో భార‌తీయుల ధనం 6625 కోట్లుగా ఉండగా, గ‌త ఏడాది ఏకంగా 20 వేల కోట్లకు చేరిన‌ట్లు ఓ మీడియా క‌థ‌నం పేర్కొంది.’ ఇది పూర్తిగా తప్పుడు వార్తని ఆర్థిక శాఖ స్పష్టత నిచ్చింది.

ఇలా ఉండగా, మొత్తం స్విస్‌ బ్యాంకుల్లో కస్టమర్ల డిపాజిట్లు 2020లో సుమారు 2 ట్రిలియన్‌ స్విస్‌ ఫ్రాంక్స్‌లకు చేరినట్లు అధికారులు తెలిపారు. ఇందులో 600 బిలియన్‌ డాలర్లు ఫారన్‌ కస్టమర్‌ డిపాజిట్లుగా ఉన్నాయన్నారు. 377 బిలియన్‌ స్విస్‌ ఫ్రాంక్స్‌తో బ్రిటన్‌ ముందు నిలవగా, 152 బిలియన్లలో అమెరికా రెండవ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు.

Read also : TS Cabinet : క్షవర వృత్తిలో వున్న నాయీ బ్రాహ్మణుల కోసం గ్రామాల్లో మోడ్రన్ సెలూన్లను తక్షణమే ఏర్పాటు చేయండి : కేబినెట్