రెయిన్ కోట్ ధరించాడు.. మొహం కనిపించకుండా మాస్క్ వేశాడు.. ఆ తర్వాత బ్యాంకులోకి ప్రవేశించాడు.. చూస్తుండగానే కాల్పులు జరిపి రూ.7లక్షలు దోచుకెళ్లాడు.. ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదశ్ లోని ఇండోర్ లో చోటుచేసుకుంది.. ఇండోర్‌లోని పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో సినీఫక్కీలో దోపిడీకి పాల్పడిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది.. ఓ దుండగుడు బ్యాంకులోనే కాల్పులు జరిపి క్యాషియర్ నుంచి రూ.7 లక్షలు దోచుకెళ్లాడు. పట్టపగలు పిఎన్‌బి, విజయ్‌నగర్ బ్రాంచ్‌లో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. రోడ్డుపై ఉన్న సీసీటీవీలో దీనికి సంబంధించిన దృశ్యాలు రికార్డయ్యాయి.. దుండగుడు.. తుపాకీ పట్టుకుని బ్యాంకు లోపలికి వెళ్లాడు.. పోలీసుల కథనం ప్రకారం.. మధ్యాహ్నం వేళ 3 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. దుండగుడు తన బైక్‌ను బ్యాంక్ ముందు పార్క్ చేసి, తుపాకీతో బ్యాంక్‌లోకి ప్రవేశించాడు.. ఈ ఘటన జరిగిన సమయంలో బ్రాంచ్‌లో సెక్యూరిటీ గార్డు ఎవరూ లేరని పోలీసులు తెలిపారు.
దోపిడీ సమయంలో అనుమానితుడు గాలిలోకి కాల్పులు జరపడంతో సిబ్బంది.. కస్టమర్లు భయాందోళనకు గురయ్యారు. ఈ క్రమంలోనే.. ఘటనా స్థలం నుంచి పారిపోయే ముందు తన బ్యాగ్‌లో డబ్బుతో నింపాలని క్యాషియర్ నుదిటిపై గన్ పెట్టి డిమాండ్ చేశాడు.. అనంతరం డబ్బులతో ఉడాయించాడని పోలీసులు తెలిపారు. దుండగుడికి సహాయంగా మరొకరు బ్యాంకు వెలుపల వేచి ఉన్నాడని కూడా పోలీసులు పేర్కొన్నారు. దోపిడీ అనంతరం వారిద్దరూ మోటార్‌సైకిల్‌పై అక్కడి నుంచి పరారయ్యారు.
#Indore के #VijayNagar थाना क्षेत्र के स्कीम नंबर 54 में मौजूद Punjab National Bank को दिन दहाड़े बदमाशों ने निशाना बनाया और डकैती की वारदात को अंजाम देकर फरार हो गए। फिलहाल जैसे ही Police को पूरे मामले की जानकारी लगी पुलिस आसपास लगे CCTV फुटेज के आधार पर आरोपियों की तलाश में… pic.twitter.com/GDN5jtKOtZ
— MP First (@MPfirstofficial) July 16, 2024
నిందితుడి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. దోపిడీకి పాల్పడిన వ్యక్తి రిటైర్డ్ ఆర్మీ సిబ్బంది లేదా సెక్యూరిటీ గార్డు అయి ఉండవచ్చునని.. ఆయుధాలు కలిగి ఉండటం, దోపిడీ చేసిన తీరును బట్టి అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం కోసం పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి సాక్షులను విచారిస్తున్నారు.
ఈ సంఘటన బ్యాంకు వద్ద ఉన్న భద్రతా చర్యల గురించి ప్రశ్నలు మొదలయ్యాయి. స్థానిక నివాసితులు, బ్యాంకు ఖాతాదారులు తమ భద్రత గురించి ఆందోళన చెందుతున్నారు. కాగా.. నిందితులను పట్టుకునేందుకు బ్యాంకు, పరిసర ప్రాంతాల్లోని అన్ని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని అదనపు పోలీస్ కమిషనర్ అమిత్ సింగ్, డీసీపీ జోన్ 2 అభినవ్ విశ్వకర్మ, డీసీపీ క్రైమ్ బ్రాంచ్ ఇండోర్ రాజేష్ దండోటియా తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..