kushboo: సినీ నటి ఖుష్బూకు కీలక పదవి.. ఏకంగా నేషనల్ లెవెల్ లో బాధ్యతలు..

|

Feb 27, 2023 | 4:48 PM

బీజేపీ లీడర్ ఖుష్బూకు కీలక పదవి దక్కింది. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా మోదీ ప్రభుత్వం నియమించింది. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధుల జాబితాలో ఖుష్బునూ చేర్చారు. తనకు ఈ పదవి..

kushboo: సినీ నటి ఖుష్బూకు కీలక పదవి.. ఏకంగా నేషనల్ లెవెల్ లో బాధ్యతలు..
Kushboo
Follow us on

బీజేపీ లీడర్ ఖుష్బూకు కీలక పదవి దక్కింది. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా మోదీ ప్రభుత్వం నియమించింది. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధుల జాబితాలో ఖుష్బునూ చేర్చారు. తనకు ఈ పదవి దక్కడంపై ఖుష్బూ ఆనందం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సేవకు భరోసా ఇచ్చారు. జాతీయ మహిళా కమిషన్‌ సభ్యులుగా ఖుష్బూ సుందర్‌తో పాటు మమతా కుమారి, డెలినా ఖోంగ్‌డుప్‌లు కూడా నియమితులయ్యారు. ఖుష్బు సుందర్ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నటి. ఆయన అభిమానులు ఆయనకు గుడి కూడా కట్టారు. గతంలో కాంగ్రెస్‌లో ఉన్న ఖుష్బూ సుందర్ 2020లోనే కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు.

ఖుష్బూ సుందర్.. తెలుగు, కన్నడ, మలయాళ చిత్రాల్లో ప్రధాన నటిగా పనిచేశారు. సినీ పరిశ్రమలో పనిచేస్తున్న వారు దక్షిణాది రాజకీయాల్లో ముఖ్యమైన స్థానాల్లో కనిపిస్తుంటారు. వారిలో ఖుష్బూ ఒకరు. ఇందులోభాగంగా ఇప్పుడు ఖుష్బూ సుందర్ కూడా రాజకీయాల్లోకి వచ్చారు. 2014లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. కాంగ్రెస్‌లో ఖుష్బూ సుందర్‌కు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వలేదు. ఖుష్బూ కూడా కాంగ్రెస్ తరపున ప్రచారం చేసినా తగిన ప్రాధాన్యత దక్కలేదు. దీంతో ఆమె 2020లో బీజేపీలో చేరారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..