AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prakash Raj: ఇది అమాయకులపై మాత్రమే జరిగిన దాడి కాదు.. ప్రకాశ్‌రాజ్ వ్యూహాత్మక పోస్ట్!

జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడిపై సినీ నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. ఈ దారుణ మారణకాండను ఆయన తీవ్రంగా ఖండించారు.ఇది కేవలం అమాయకులపై జరిగిన దాడి మాత్రమే కాదు, కశ్మీర్‌పై జరిగిన దాడి అని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనతో ప్రతి కశ్మీరీ గుండె ముక్కలైందని, మాటలు రావడం లేదన్నారు. గుండెల్లో అంతులేని బాధతో ఇది రాస్తున్నట్లు తెలిపారు.

Prakash Raj: ఇది అమాయకులపై మాత్రమే జరిగిన దాడి కాదు.. ప్రకాశ్‌రాజ్ వ్యూహాత్మక పోస్ట్!
Prakashraj
Anand T
|

Updated on: Apr 24, 2025 | 8:38 PM

Share

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఈ దారుణ మారణకాండపై సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌ స్పందించారు. దాయాదుల ఉగ్రవాద చర్యను ఆయన తీవ్రంగా ఖండించారు. ఒక కాశ్మీరీ వ్యక్తి సందేశం అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. ఇది కేవలం అమాయకులపై జరిగిన దాడి మాత్రమే కాదు, కశ్మీర్‌పై జరిగిన దాడి అని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనతో ప్రతి కశ్మీరీ గుండె ముక్కలైందని, మాటలు రావడం లేదన్నారు. గుండెల్లో అంతులేని బాధతో ఇది రాస్తున్నట్లు తెలిపారు. ఇది కశ్మీరీలు మౌనం వీడాల్సిన సమయమని..దీన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలి అని ఆయన అన్నారు.

ఏప్రిల్‌ 22, 2025.. పర్వతాలు సైతం మోయలేనంత నిశ్శబ్దం ఆవరించిన రోజు.. ప్రశాంతమైన ప్రకృతి ప్రదేశంలో నెత్తురు చిందిన రోజు.. ఈ రోజు ప్రతి కశ్మీరీ గుండె పగిలింది.ఈ కూర్రమైన చర్యను చెప్పటానికి మాటలు కూడా రావట్లేదు… అందుకే బరువైన, బాధతో కూడిన హృదయంతో ఇది రాస్తున్నా. మన ఇంటికి వచ్చిన అమాయక అతిథులను దారుణం కాల్చి చంపారు. ప్రశాంత వాతావరణాన్ని ఆస్వాదించేందుకు వచ్చిన పర్యాటకులు భయానక స్థితిని ఎదుర్కొన్నారు. ఈ అనాగరిక దాడి అమాయకులపై జరిగిన దాడి మాత్రమే కాదు, కశ్మీర్‌పై దాడి. ఇది శతాబ్దాల సంప్రదాయాలకు జరిగిన అవమానం. మన విశ్వాసాన్ని దెబ్బతీసేలా దుష్ట ప్రయోజనాల కోసం చేసిన దారుణచర్య అని ఆయన పోస్ట్‌లో పేర్కొన్నారు.

‘‘ఇలాంటి దారుణాలు జరిగిన ప్రతిసారి మనల్ని మనం నిరూపించుకోవాల్సి వస్తోంది. చేయని పనికి అవమాన భారాన్ని మోయాల్సి వస్తోంది. దీనిని అస్సలు క్షమించం లేం.. ఇది నిజంగా భయంకరమైన చర్య అని ఆయన అన్నారు. అంతకుమించి పిరికిపంద చర్య’ ఇలాంటి సమయంలో కశ్మీరులు మౌనంగా ఉండకూడదు. మేము ఎంతో దుఃఖంతో ఉన్నాం. మన ఇంట్లో జరిగిన ఈ క్రూర చర్యకు నిజంగా సిగ్గుపడుతున్నాం. దయచేసి మమ్మల్ని ఈ దృష్టికోణం నుంచి మాత్రం చూడొద్దని వేడుకుంటున్నా. ఇది నిజమైన కశ్మీరీలు చేసింది కాదు. మా తల్లిదండ్రులు హంతకులను పెంచి పోషించలేదు. ఉగ్రవాదులు ఏం ఆశించి ఇలాంటి దారుణ హింసకు పాల్పడ్డారో తెలియదు. మీ చర్య కొన్ని కుటుంబాలను నాశనం చేసింది. పిల్లలను అనాథలుగా మార్చింది’’ అని ఆయన రాసుకొచ్చారు. కశ్మీర్‌ ఏం ఆట స్థలం కాదు. యుద్ధం క్షేత్రం అంతకన్నా కాదు.ఇది అతిథులకు స్వాగతం పలికి, గౌరవించే ప్రదేశం’ అని ప్రకాశ్‌రాజ్‌ పోస్ట్‌ చేశారు.

మరిన్ని జాతీయ వార్తల  కోసం ఇక్కడ క్లిక్ చేయండి