ఆ ధైర్యం కొంతమందికే ఉంటుంది: రాహుల్ రాజీనామాపై ప్రియాంక

ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి బుధవారం రాహుల్ గాంధీ రాజీనామా ప్రకటించారు. ఈ మేరకు నాలుగు పేజీలతో కూడిన సుదీర్ఘమైన లేఖను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తాజాగా ఈ విషయంపై ఆయన సోదరి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ స్పందించారు. ‘‘నీలాగా చేసే ధైర్యం కొంతమందికే ఉంటుంది. నీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నా’’ అని ఆమె ట్వీట్ చేశారు. Few have the courage […]

ఆ ధైర్యం కొంతమందికే ఉంటుంది: రాహుల్ రాజీనామాపై ప్రియాంక

Edited By:

Updated on: Jul 04, 2019 | 10:28 AM

ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి బుధవారం రాహుల్ గాంధీ రాజీనామా ప్రకటించారు. ఈ మేరకు నాలుగు పేజీలతో కూడిన సుదీర్ఘమైన లేఖను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తాజాగా ఈ విషయంపై ఆయన సోదరి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ స్పందించారు. ‘‘నీలాగా చేసే ధైర్యం కొంతమందికే ఉంటుంది. నీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నా’’ అని ఆమె ట్వీట్ చేశారు.

కాగా తన పదవికి రాజీనామా చేసిన రాహుల్.. పార్టీ మళ్లీ పుంజుకోవడానికి కఠిన నిర్ణయాలు అవసరమని లేఖలో పేర్కొన్నారు. పార్టీని పూర్తిగా సంస్కరించాల్సి ఉందని ఆయన చెప్పుకొచ్చారు. ఇక కొత్త నేతను తానే ఎంపిక చేయాలనడం సరికాదని.. వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేసి తన స్థానంలో కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయాలని రాహుల్ వెల్లడించిన విషయం తెలిసిందే.