Wrestlers Protest: రెజ్లర్లకు రైతులు సంఘీభావం.. నేడు జంతర్ మంతర్ వద్దకు చేరుకోనున్న అన్నదాతలు

|

May 07, 2023 | 7:13 AM

రెజ్లర్లకు రైతులు మద్దతు తెలపనున్నారు. కొన్ని రోజులుగా జంతర్‌ మంతర్‌లో నిరసన చేస్తున్నవారికి ఈరోజు సంఘీభావం ప్రకటించబోతున్నారు.

Wrestlers Protest: రెజ్లర్లకు రైతులు సంఘీభావం.. నేడు జంతర్ మంతర్ వద్దకు చేరుకోనున్న అన్నదాతలు
Wrestlers Protest
Follow us on

లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా దేశరాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న రెజ్లర్లకు,  రైతులు సంఘీభావం ప్రకటించారు. ఈరోజు వేలాది మంది అన్నదాతలు ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్దకు రానున్నారు. నిరసన చేస్తున్న రెజ్లర్లకు తమ మద్దతు తెలుపనున్నారు. బీజేపీ ఎంపీ, రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ చీఫ్‌ బ్రిజ్‌ భూషణ్‌ సింగ్‌ తమపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు మహిళా రెజ్లర్లు ఆరోపించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో మరోసారి నిరసనకు దిగారు.

ఈ నేపథ్యంలో రైతు సంఘాల కూటమి అయిన సంయుక్త కిసాన్ మోర్చా మహిళా మల్లయోధులకు మద్దతుగా నిలిచింది. బ్రిజ్‌ భూషణ్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. దేశవ్యాప్తంగా ఆందోళనలు, నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఢిల్లీ, పంజాబ్‌, హర్యానా, ఉత్తరప్రదేశ్‌కు చెందిన రైతు నేతలు, వేలాది మంది రైతులు ఈరోజు ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్దకు చేరుకోనున్నారు.

గత కొన్ని రోజులుగా అక్కడే ఉండి నిరసన చేస్తున్న రెజ్లర్లకు సంఘీభావం తెలుపనున్నారు. అనంతరం కేంద్ర హోంమంత్రి, కేంద్ర క్రీడల మంత్రి, ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌ను రైతు బృందాలు కలువనున్నాయి. బ్రిజ్‌ భూషణ్‌ సింగ్‌ను వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేయనున్నారు. అలాగే ఈ నెల 11 నుంచి 18 వరకు దేశంలోని అని రాష్ట్రాల రాజధానులు, జిల్లాల హెడ్‌ క్వార్టర్లలో ఆందోళనలు చేపట్టనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..