115 మంది ఢిల్లీ పోలీసుల అదుపులో ఉన్నారు.. మిగతా వారి ఆచూకీ కోసం ప్రయత్నిస్తాం: అరవింద్ కేజ్రీవాల్

Farmers' tractor rally violence - Arvind Kejriwal: గణతంత్ర దినోత్సవం రోజున దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన హింసాకాండ అనంతరం చాలా మంది రైతులు తప్పిపోయినట్లు మానవ హక్కుల సంఘాలు పేర్కొంటున్నాయి. రైతుల ఆచూకీ కోసం వారి కుటుంబాలు కూడా..

115 మంది ఢిల్లీ పోలీసుల అదుపులో ఉన్నారు.. మిగతా వారి ఆచూకీ కోసం ప్రయత్నిస్తాం: అరవింద్ కేజ్రీవాల్
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 03, 2021 | 6:21 PM

Farmers’ tractor rally violence – Arvind Kejriwal: గణతంత్ర దినోత్సవం రోజున దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన హింసాకాండ అనంతరం చాలా మంది రైతులు తప్పిపోయినట్లు మానవ హక్కుల సంఘాలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో రైతుల ఆచూకీ కోసం వారి కుటుంబాలు నిరంతరం ఢిల్లీ పోలీసులు, ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాయి. రైతు నేతలు కూడా సీఎం కేజ్రీవాల్‌ను కలిసి తప్పిపోయిన వారిని కనుగొనాలని వారి జాబితాను సైతం అందించారు. ఈ తరుణంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రకటన చేశారు. ట్రాక్టర్ల ర్యాలీ అనంతరం ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నవారి జాబితాను బుధవారం కేజ్రీవాల్ విడుదల చేశారు. జనవరి 26 ఘటనల అనంతరం ఆచూకీ లేకుండా పోయిన రైతులను కనుగొనడంలో ప్రభుత్వం పూర్తి సహకారాన్ని అందిస్తుందని కేజ్రీవాల్‌ వెల్లడించారు.

ఈ మేరకు బుధవారం ఆప్ అధినేత, సీఎం అరవింద్ కేజ్రీవాల్ విలేకరులతో మాట్లాడారు. గణతంత్ర దినోత్సవం రోజు జరిగిన ఘటనలకు సంబంధించి ఇప్పటివరకు 115 మంది ఢిల్లీ పోలీసుల అదుపులో ఉన్నారని ఆయన తెలిపారు. ప్రస్తుతం వారంతా రాజధానిలోని పలు జైళ్లల్లో ఉన్నట్లు వెల్లడించారు. ఇంకా రైతుల ఆచూకీని కనుగొనేందుకు దిల్లీ ప్రభుత్వం పూర్తి సహకారాన్ని అందిస్తుందన్నారు. అవసరమైతే కేంద్ర ప్రభుత్వం, లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌తో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేజ్రీవాల్ వెల్లడించారు.

Also Read:

Farmers Protest: అలా చేయకపోతే చర్యలు తప్పవు.. ట్విట్టర్‌కు కేంద్ర ప్రభుత్వం వార్నింగ్..

#WATCH: కిసాన్ మహాపంచాయత్‌లో కుప్పకూలిన స్టేజీ.. బీకేయూ నేత తికాయత్‌కు స్వల్పగాయాలు.. వీడియో