Farmers Protest: రైతుల నిరసనను తప్పుదారి పట్టించేందుకు పాకిస్తాన్ ఐఎస్ఐ కుట్ర.. నిఘా వర్గాల హెచ్చరిక..

|

Jun 26, 2021 | 9:02 AM

Farmers Protest: గత ఏడు నెలలుగా కొనసాగుతున్న తమ ఆందోళనలకు గుర్తుగా నేడు దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో చలో రాజ్‌భవన్ కార్యక్రమం..

Farmers Protest: రైతుల నిరసనను తప్పుదారి పట్టించేందుకు పాకిస్తాన్ ఐఎస్ఐ కుట్ర.. నిఘా వర్గాల హెచ్చరిక..
Farmers Protest
Follow us on

Farmers Protest: గత ఏడు నెలలుగా కొనసాగుతున్న తమ ఆందోళనలకు గుర్తుగా నేడు దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో చలో రాజ్‌భవన్ కార్యక్రమం చేపట్టాలని రైతు సంఘాల నేతలు పిలుపునిచ్చారు. గవర్నర్లను కలిసి వినతి పత్రాలు అందజేయాలని కోరారు. అయితే, రైతుల నిరసన ప్రదర్శనల నేపథ్యంలో ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. రైతుల నిరసనను తప్పుదారి పట్టించేందుకు పాకిస్తాన్ ఐఎస్ఐ కుట్ర పన్నిందని ఇంటెలిజెన్స్ వర్గాలు వార్నింగ్ ఇచ్చాయి. ఈ మేరకు కేంద్రం, రాష్ట్రాల ప్రభుత్వాలకు ఇంటెలిజెన్స్ అధికారులు లేఖ రాశారు. పోలీసులను రెచ్చగొట్టి హింసకు ప్రేరేపించే అవకాశం ఉందన్నారు. ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో ఢిల్లీ సహా అన్ని రాష్ట్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. ముఖ్యంగా జనవరి 26న జరిగిన ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీలో ముందు జాగ్రత్త ఏర్పాట్లు చేశారు. ఢిల్లీ రాజ్‌భవన్ పరిసర మెట్రో స్టేష్ల వద్ద ఆంక్షలు పెట్టారు. విమానాశ్రయాల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఎల్లో లైన్ రూట్‌లో ఉన్న మూడు మెట్రో స్టేషన్లను మూసివేయాలని డిసైడ్ అయ్యారు.

ఇదిలాఉంటే.. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ఢిల్లీ సరిహద్దుల్లోని తిక్రీ, సింఘు, ఖాజీపూర్ ప్రాంతాల్లో గతేడాది నవంబర్ నుంచి అంటే ఏడు నెలలుగా నిరసనలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, రైతుల ఆందోళనల పట్ల ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా రాకపోవడంతో రైతులు తమ ఆందోళనలను మరింత తీవ్రతరం చేయాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగానే భారతదేశం అంతటా రైతులు ఆయా రాష్ట్రాల్లోని రాజ్‌భవన్ వరకు ర్యాలీ చేపట్టాలని, వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ గవర్నర్లకు వినతిపత్రం సమర్పించాలని సంయుక్త కిసాన్ మోర్చా ప్రతినిధులు పిలుపునిచ్చారు. భారతీయ కిసాన్ యూనియన్ అఖిల భారత అధ్యక్షుడు నరేష్ తికాయత్ కూడా ఈ పిలుపునకు మద్ధతు ప్రకటించారు. మూడు కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడు నెలల రైతుల ఆందోళన పూర్తయిన సందర్భంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌కు మెమోరాండమ్‌ ఇవ్వనున్నట్లు తికాయత్ తెలిపారు.

Also read:

IRCTC Ticket Booking: ట్రైన్‌ టిక్కెట్లు బుక్ చేసుకోవాలంటే.. ఇకనుంచి అవి ఉండాల్సిందే..!