Lata Mangeshkar Cremated in Mumbai: లెజెండరీ సింగర్, మెలోడీ క్వీన్(Melody Queen), గాన కోకిల లతా మంగేష్కర్ ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్‌లో కన్నుమూశారు. ఆమె గత 29 రోజులుగా ఆసుపత్రిలో చికిత్సపొందుతూ.. ఆదివారం ఉదయం తుది శ్వాసవిడిచారు. జనవరి 8న ఆమె కోవిడ్(Covid-19)తో బాధపడుతూ ఆసుపత్రిలో చేరారు. ఆమెకు న్యుమోనియా కూడా సోకడంతో ఆసుపత్రిలో ఐసీసీయూలో చికిత్స అందించారు. కాగా, రెండు రోజుల క్రితం వరకు ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగుపడినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఆమె ఆరోగ్యం మునుపటి కంటే మెరుగ్గా ఉందని వైద్యులు ప్రతుత్ సమ్దానీ చెప్పారు. అయితే ఈ ఉదయం లతా మంగేష్కర్ లేరన్న వార్త ప్రపంచవ్యాప్తంగా సంగీత ప్రియులను శోకసంద్రంలో ముంచేసింది.
భారతరత్న అవార్డు గ్రహీత లతా మంగేష్కర్ మరణం యావత్ సినీ ప్రపంచాన్ని శోకసంద్రంలోకి నెట్టివేసింది. ఎన్నో పాటలకు తన గొంతుతో ప్రాణం పోసిన ఆ గానకోకిల మూగబోయిందని తెలిసి అభిమానులు దుఃఖ సాగరంలో మునిగిపోయారు. ఇక చివరిసారిగా ఆమె పార్థివదేహాన్ని చూసి నివాళులు అర్పించేందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ సహా రాజకీయ, సినీ ప్రముఖులు సహా అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖుల కన్నీ టి వీడ్కో లు మధ్య ప్రముఖ గాయని లతా మంగేష్కర్ అంత్యక్రియలు ముగిశాయి.. ఈ శోక సంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా తన కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ ఎప్పుడూ లతా దీదీకి గౌరవం ఇస్తూ, ఆమెకు సాష్టాంగ నమస్కారం చేస్తూ, పూజిస్తూ ఉండేవారు. లతాజీ మృతి పట్ల భారత ప్రభుత్వం రెండు రోజుల జాతీయ సంతాప దినాలు ప్రకటించింది.
ముంబైలోని శివాజీ పార్కులో ఆమె పార్థివ దేహాన్ని ఉంచగా, ప్రధాని నరేం ద్రమోడీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తదితరులు సందర్శిం చి ఘన నివాళులర్పించారు. అనంతరం సైనిక లాంఛనాలు పూర్తి అయ్యాక, లతా మంగేష్కర్ చితికి ఆమె సోదరుడు హృదయనాథ్ మంగేష్కర్ జ్యోతి వెలిగించారు. బరువెక్కిన హృదయాలతో ముంబై వాసులు లతా మంగేష్కర్‌కు కన్నీటి వీడ్కోలు పలికారు.
मुंबई: शिवाजी पार्क में भारत रत्न लता मंगेशकर के पार्थिव शरीर का अंतिम संस्कार किया गया। #LataMangeshkar pic.twitter.com/OsO7hsDxNa
— ANI_HindiNews (@AHindinews) February 6, 2022
తన సాదాసీదా వ్యక్తిత్వం, వెల్వెట్ వాయిస్‌తో యావత్ ప్రపంచాన్ని తనవైపు ఆకర్షించిన లతా మంగేష్కర్ లేకపోవడం సంగీత లోకానికి కోలుకోలేని లోటు. గాయనిగా లతా మంగేష్కర్ 1942లో లతా మంగేష్కర్ కెరీర్‌ను ప్రారంభించారు. 36 భాషల్లో 50 వేలకు పైగా పాటలు పాడారు. సోలోగా 25 వేలకు పైగా పాటలు పాడి గిన్నీస్ రికార్డు సొంతం చేసుకున్నారు. తన కెరీర్‌లో చాలా మంది సంగీతకారులతో పనిచేశారు. అతను చలనచిత్ర ప్రపంచంలో అనేక దశాబ్దాలు గడిపారు. లతా మంగేష్కర్ తన వ్యక్తిత్వం గాత్రంతో మెప్పించని వారిలో ఒకరు. భారత ప్రభుత్వం ఆమెకు పద్మభూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే, భారత రత్న, పద్మ విభూషణ్ అవార్డులతో సత్కరించింది. ఇప్పటికీ లతా జీ పాటలకు ఎంతో పేరుంది.. క్రేజ్ ఉంది.. ఆమె లాంటి గాయని మరొకరు లేరు రారు అంటూ చాలా మంది ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తుంటారు. ప్రస్తుతం ఈమెకు 92 ఏళ్లు. వయోభారంతో కొన్నేళ్లుగా పాటలు పాడటం లేదు లత మంగేష్కర్. త్వరగా కోలుకొని మళ్లీ లేచి వస్తారనుకుంటే తీరని విషాదంలో ముంచేసి వెళ్లిపోయారు లతాజీ.
Read Also…. Lata Mangeshkar: లతా మంగేష్కర్ గురించి ప్రపంచానికి పెద్దగా తెలియని ఆసక్తికర విశేషాలు మీకోసం..