రూ. 100, రూ. 200 కు వస్తుందనో…లేక రోడ్డు మీదకు వెళ్తే పోలీసులు ఎక్కడ పట్టుకుని చలానా వేస్తారో అన్న భయంతో నాణ్యత లేని హెల్మెట్ పెట్టుకుంటే అంతే సంగతులు. పోలీసుల చలాన్ల సంగతి పక్కనబెడితే మీ ప్రాణానికి అయితే గ్యారంటీ లేదు. ఈ క్రమంలో ఇప్పటివరకు వాహనదారులకు చెప్పి, అవగాహన కార్యక్రమాలు నిర్వహించి విసిగి వేసారిన పోలీసులు నకిలీ హెల్మెట్స్ తయారీ కేంద్రాలపై దేశవ్యాప్తంగా దాడులు జరుపుతున్నారు. తాజాగా ఢిల్లీ కేంద్రంగా నకిలీ హెల్మెట్స్ తయారుచేసి అమ్ముతున్న ముఠాను పట్టుకున్నారు. ఘజియాబాద్‌లో కూడా 12 కంపెనీల మీద సోదాలు చేసిన పోలీసులు…ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఢిల్లీ కేంద్రంగా వీళ్లంతా నకిలీ హెల్మెట్స్ అమ్ముతున్నట్లు వివరించారు. కచ్చితంగా ప్రతి ఒక్కరు నాణ్యమైన BIS హెల్మెట్స్ వాడాలని సూచిస్తున్నారు.
నకిలీ హెల్మెట్స్ అమ్మినా, తయారు చేసినా చీటింగ్ కేస్ తప్పదంటున్నారు పోలీసు ఉన్నతాధికారులు. ట్రాఫిక్ సిగ్నల్స్, కాలేజీలకు వెళ్లి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. మొబైల్‌కి వాడే స్క్రీన్ గార్డుని ఎలాగైతే ఎక్కువ డబ్బులు పెట్టి కొనుకుంటున్నామో…అలాంటిది మన ప్రాణం, తలను కాపాడుకోడానికి అంతే నాణ్యమైన హెల్మెట్ వాడాలని చెబుతున్నారు.
ప్రాణం పోతే తిరిగి రాదు..మనం బండి మీద వెళ్తున్నప్పుడు ఎవరు ఎటు నుండి వచ్చి ప్రమాదానికి కారణమవుతారో తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరు రోడ్డు పక్కన దొరికే హెల్మెట్స్ కాకుండా..డబ్బులు ఎక్కువైన సరే…నాణ్యమైన హెల్మెట్స్ నే వాడటం ఉత్తమం. మీ కుటుంబం ఇంటి మీ కోసం ఎదురుచూస్తుంది. ఆలోచించి నిర్ణయం తీసుకోండి.
Also Read:
విద్యుత్ షాక్‌తో చేపలు పడుతున్న మత్స్యకారులు.. పెను ప్రమాదమని హెచ్చరిస్తోన్న అధికారులు