PM Kisan Tractor Yojana: రైతుల ఆదాయాన్ని పెంచడానికి.. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను తీసుకువస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో కొత్త పథకం గురించి విపరీతమైన ప్రచారం జరుగుతోంది. అదేంటంటే.. పీఎం కిసాన్ యోజన కింద అతని ఖాతాలో ఏటా 6000 రూపాయలు జమ అవుతుందని, విత్తనాలు, ఎరువులు, అనేక రకాల యంత్రాలపై భారీగా రాయితీలు ఇస్తారంటూ విపరీతమై ప్రచారం జరుగుతోంది. అంతేకాదు.. రైతులకు ట్రాక్టర్లు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఊహించని రీతిలో రూ. 5 లక్షల మేర సబ్సిడీ ఇస్తుందని ఆ ప్రచార సారాంశం. ఆ ప్రచారాన్ని నమ్మిన రైతులు.. అసలు ఈ స్కీమ్ ఏంటి? దీని వెనుక కథ ఏంటి? అని ఆరా తీశారు. మరోవైపు ఈ ప్రచారంపై ప్రభుత్వం వర్గాలకు సమాచారం అందడంతో ప్రభుత్వం సైతం దీనిపై స్పందించింది.
అయితే, రైతులకు ప్రయోజనం చేకూర్చే పథకాలు అనేకం ఉన్నాయని చెప్పుకొచ్చిన ప్రభుత్వం.. తాజాగా పీఎం కిసాన్ ట్రాక్టర్ యోజన కింద సబ్సిడీ ట్రాక్టర్లకు సంబంధించి జరుగుతున్న ప్రచారాన్ని ఖండించింది. ఆ ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని తేల్చి చెప్పింది. అలాంటి పథకమేమీ లేదని ఫుల్ క్లారిటీ ఇచ్చింది. ఇదే అంశంపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ కూడా క్లారిటీ ఇచ్చింది. ట్విట్టర్ ద్వారా దీనికి సంబంధించిన వివరాలను పోస్ట్ చేసింది. కేంద్ర ప్రభుత్వం అలాంటి పథకం ఏమీ పెట్టలని తేల్చి చెప్పింది. ఈ మేరకు ట్వీట్ చేసిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్.. ప్రచారంలో ఉన్న ఫేక్ వివరాలను కొట్టివేసింది.
दावा: केंद्र सरकार पीएम किसान ट्रैक्टर योजना के तहत आधे दाम में ट्रैक्टर मुहैया करा रही है।#PIBFactCheck : केंद्र सरकार द्वारा ऐसी कोई योजना नहीं चलाई जा रही। pic.twitter.com/0qTbN9KxgP
— PIB Fact Check (@PIBFactCheck) August 15, 2020
Also read:
Chat Without Internet : ఇంటర్నెట్ లేకుండా వాట్సాప్ చాట్ చేయండి.. ఎలానో తెలుసా..