F-35B: ఐదు వారాల పాటు భారత్‌లోనే.. ఎట్టకేలకు కేరళను వీడిన UK ఫైటర్‌ జెట్!

సాంకేతిక లోపంతో కేరళలోని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్‌ అయిన UK నేవీకి చెందిన F-35B ఫైటర్ జెట్ ఎట్టకేలకు ఇండియాను వీడింది. జెట్‌ను రిపేర్‌ చేసేందుకు కేరళకు వచ్చిన 15 మంది UK ఇంజనీర్లు ఐదు వారాల తర్వాత దాన్ని తిరిగి తీసుకెళ్లారు. హైడ్రాలిక్‌ వ్యవస్థ విఫలం కావడంతో జూన్‌ 14వ తేదీన తిరువనంతపురం విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండి అయిన ఈ ఫైటర్‌ జెట్‌ ఐదు వారాల పాటు ఇక్కడే ఉండిపోయింది.

F-35B: ఐదు వారాల పాటు భారత్‌లోనే.. ఎట్టకేలకు కేరళను వీడిన UK ఫైటర్‌ జెట్!
F 35b Fighter

Updated on: Jul 22, 2025 | 1:14 PM

బ్రిటన్‌ నౌకాదళానికి చెందిన సూపర్‌ ఫైటర్‌ జెట్‌ ఎఫ్‌-35 (F-35B Fighter)లో హైడ్రాలిక్‌ వ్యవస్థ విఫలం కావడంతో జూన్‌ 14వ తేదీన కేరళలోని తిరువనంతపురం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండ్‌ అయింది. దీంతో జెట్‌కు మరమ్మతు చేయడానికి బ్రిటన్‌ నుంచి 15 మంది ఇంజనీర్ల బృందం కేరళకు వచ్చింది. సుమారు ఐదురోజుల పాటు ఈ ఫైటర్‌ జెట్‌ను రిపేర్‌ చేసిన ఇంజనీర్లు ఎట్టకేలకు దాని సమస్యను పరిష్కరించారు. రిపేర్ పూర్తయిన తర్వాత ఫైటర్ జెట్‌ను హ్యాంగర్ నుండి బయటకు తీసుకువచ్చి విమానాశ్రయంలోని పార్కింగ్ బేలో ఉంచారు. తర్వాత ఈ ఫైటర్‌ జెక్‌కు ఫ్యూల్‌ ఫిల్‌ చేశారు. ఆ తర్వాత జెట్‌ను తీసుకొని వాళ్లు రన్‌వే నుంచి టేకాఫ్ అయి విజయవంతంగా వెళ్లిపోయారు.

ఫైటర్‌ జెట్‌కు లాజిస్టిక్‌ మద్దతు అందించిన ఐఏఎఫ్

బ్రిటన్‌ నౌకాదళానికి చెందిన ఈ ఫైటర్‌ జెట్‌ ఆస్ట్రేలియా దిశగా ప్రయాణిస్తుండగా మార్గమధ్యలో పైలెట్‌ ఇంధన సమస్యను, తీవ్రమైన వాతావరణ పరిస్థితులను ఎదుర్కొన్నారు. దీంతో అప్రమత్తమైన ఫైలట్‌ తిరువనంతపురం ఏటీసీకి ల్యాండింగ్‌ కోసం రిక్వెస్ట్ పంపంగా అందుకు ఏటీసీ మద్దతు చెప్పడంతో ఈ ఫైటర్‌ జెట్‌ తిరువనంతపురం ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ అయ్యింది. విమానానికి కావాలసిన ఇంధనం, ఇతర లాజిస్టిక్స్‌ను కూడా అందించేందుకు భారత్‌ మద్దతు ఇచ్చింది. దీంతో జెట్‌ను రీపేర్‌ చేసేందుకు మద్దతు ఇచ్చిన భారత అధికారులకు బ్రిటిష్‌ అధికారులు కృతజ్ఞతలు తెలిపారు.

వీడియో చూడండి..

విమానాశ్రయంలో పార్కింగ్ ఫీజు వసూలు చేయాలి

అయితే ఫైటర్‌ జెట్‌ ఇన్ని రోజుల పాటు ఎయిర్‌పోర్టులో ఉన్నందుకు అమెరికా నుంచి పార్కింగ్‌ ఛార్జీలు వసూలు చేస్తామని ఎయిర్‌పోర్టు వర్గాలు చెప్పినట్టు కొన్ని మీడియా నివేదికలు పేర్కొన్నాయి. ప్రస్తుత ధరల ప్రకారం పార్కింగ్ ఛార్జీ రోజుకు రూ. 15,000-20,000 మధ్య ఉంటుందని.. దీనితో పాటు, యుద్ధ విమానాలు, ఎయిర్‌బస్‌లకు ల్యాండింగ్‌ ఛార్జీ కూడా ఉంటుందని చెప్పినట్టు తెలుస్తోంది. ఇది రూ. 1 లక్ష నుండి రూ. 2 లక్షల వరకు ఉంటుంది పేర్కొన్నాయి. విమానాశ్రయంలో నిర్వహణ, మరమ్మత్తు సహా ఇతర సౌకర్యాన్ని ఉపయోగించుకోవడానికి ఎయిర్ ఇండియా కూడా ఛార్జీలను నిర్ణయిస్తుందని అధికారి తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.