సేవ్‌ ఆరావళి.. మూడు రాష్ట్రాల్లో మార్మోగిపోతున్న నినాదాలు.. ఎందుకో తెలుసా?

సేవ్ ఆరావళి అని ఎక్కడికక్కడ ప్రజలు ప్లకార్డులు పట్టుకుని.. నిరసనలు తెలపడానికి కారణం నవంబర్‌ 20 సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పే. ఆరావళి పర్వత శ్రేణికి కొత్త అర్ధాన్ని ఇస్తూ.. సుప్రీంకోర్టుకు అఫిడవిట్‌ను దాఖలు చేసింది కేంద్ర ప్రభుత్వం. దీనిని సుప్రీకోర్టు స్వీకరించి ఆమోదం తెలపడంతో వివాదం మొదలైంది. అసలు ఆరావళి పర్వత శ్రేణికి కొత్త అర్ధం ఏంటి?

సేవ్‌ ఆరావళి.. మూడు రాష్ట్రాల్లో మార్మోగిపోతున్న నినాదాలు.. ఎందుకో తెలుసా?
Aravalli Range

Updated on: Dec 22, 2025 | 1:24 PM

సేవ్ ఆరావళి అని ఎక్కడికక్కడ ప్రజలు ప్లకార్డులు పట్టుకుని.. నిరసనలు తెలపడానికి కారణం నవంబర్‌ 20 సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పే. ఆరావళి పర్వత శ్రేణికి కొత్త అర్ధాన్ని ఇస్తూ.. సుప్రీంకోర్టుకు అఫిడవిట్‌ను దాఖలు చేసింది కేంద్ర ప్రభుత్వం. దీనిని సుప్రీకోర్టు స్వీకరించి ఆమోదం తెలపడంతో వివాదం మొదలైంది. అసలు ఆరావళి పర్వత శ్రేణికి కొత్త అర్ధం ఏంటి? అంటే.. ఈ శ్రేణిలో వంద మీటర్ల కన్నా ఎక్కువ ఉన్న పర్వతాలనే ఆరావళి పర్వతాలుగా గుర్తిస్తారు. మిగిలిన వాటిని సాధారణ కొండలు గుట్టలుగా గుర్తిస్తారు. అంతేకాదు.. 500 మీటర్ల రేంజ్‌లో రెండు అంతకన్నా ఎక్కువ పర్వతాలు ఉండాల్సిందే..! ఒకటే పర్వతం ఉండి 500 మీటర్ల దూరం వరకు మరోటి ఉండకపతే.. దాన్ని ఆరావళి కిందకు తీసుకురారు. కేంద్రం ఇచ్చిన ఈ కొత్త డెఫినిషన్‌తో.. మైనింగ్‌ మాఫియా రెచ్చిపోతుందని ఆందోళనలు మొదలయ్యాయి. కొత్త మైనింగ్‌ లీజులు ఇవ్వొద్దని సుప్రీం చెబుతున్నా.. రాష్ట్రాలు విచ్చలవిడిగా కొండలను కొట్టేసే ప్రమాదం ఉందని ఆందోళనలు నిర్వహిస్తున్నారు స్థానికులు.

కేంద్రం ఇచ్చిన డెఫినిషన్‌ను సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వడంతో చిన్న చిన్న కొండలకు ప్రమాదం ఏర్పడింది. ఇవి ఆయా ప్రాంతాల్లో చాలా కీలకంగా ఉన్నాయి. వాటి వల్ల వాతావరణ మార్పులు, వర్షాల వంటివి ఏర్పడడమే కాదు.. ఆరావళికి మరో పక్కన ఉన్న థార్‌ ఎడారి వ్యాపించకుండా తోడ్పడుతున్నాయి. ఇప్పుడు ఈ కొండలను కొట్టేస్తే, పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడికక్కడ గ్రామస్తులు ఆరావళి పర్వతాలను ఎక్కి నిరసనలు తెలుపుతున్నారు. తాజాగా జైపూర్‌లో భారీ ర్యాలీ కూడా తీశారు. ఆరావళిపై కేంద్రం ఇచ్చిన కొత్త అర్ధాన్ని మార్చేయాలని.. లేకుంటే ప్రజా ఉద్యమాలు తప్పవంటున్నారు. అయితే కొత్త అర్ధంతో ఆరావళికి ఎలాంటి ముప్పు వాటిల్లనివ్వమంటోంది కేంద్రం. 90శాతం ఆరావళిని టచ్‌ చేయబోమంటోంది. వాటిని కాపాడడానికి కఠిన చర్యలు తీసుకుంటామంటోంది కేంద్రం.

ఢిల్లీ నుంచి మొదలు పెడితే.. హర్యానా, రాజస్థాన్‌, గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ వరకు ఈ ఆరావళి పర్వతశ్రేణి 650 కిలోమీటర్ల మేర వ్యాపించింది ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతన పర్వతశ్రేణి. దాదాపు 25 కోట్ల ఏళ్ల క్రితం ఏర్పడినట్లు ఇప్పటికే పలు పరిశోధనల్లో తేలింది. ఈ పర్వతాల వల్లే భారతదేశం ఎడారి ప్రాంతం కాకుండా కాపాడబడుతోంది. దీనివల్లే ఉత్తర, మధ్య భారతంలో పర్యావరణం సమతుల్యంగా ఉంది. ఈ పర్వతశ్రేణిలో జీవ వైవిధ్యం ఉంది. మౌంట్‌ అబూ లాంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పర్వతాలు కూడా ఉన్నాయి. బనస్‌, లుని, సఖి, సబర్మతి వంటి నదులకు పుట్టినిల్లు ఆరావళి పర్వతాలే. వీటి చుట్టూ చిరుతలు, నక్క జాతులు, ముంగీసలు, అనేక రకాల పక్షిజాతులు కూడా ఉన్నాయి.

ఢిల్లీతోపాటు ఉత్తర భారతంలో ఇప్పటికీ ప్రజలు బతుకుతున్నారంటే ఆరావళి ఇస్తున్న ఆక్సిజనే. దీన్ని ఢిల్లీకి గ్రీన్‌లంగ్‌లా భావిస్తారు. అయితే ఈ పర్వతాల కింద రిచ్‌ మినరల్‌ ఉన్నాయి. మార్బుల్‌, గ్రానైట్‌, జింక్‌, కాపర్‌ నిల్వలు మెండుగా ఉండడం వల్ల.. మైనింగ్‌ మాఫియా ఆరావళిని మింగేసే ప్రమాదం కనిపిస్తోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..