RBI: రూ.2 వేల నోట్ల వాపస్.. కష్టాలన్నీ వాళ్లకే..

| Edited By: Basha Shek

May 20, 2023 | 12:26 PM

రూ. 2 వేల నోట్లను వెనక్కి తీసుకుంటున్నట్లు రిజర్వు బ్యాంకు ఆంక్షలు విధిచడంతో సామాన్యులపై ఎంతవరకు ప్రభావం ఉంటుందోనన్న చర్చలు మొదలయ్యాయి. 2016లో నోట్ల రద్దు చేసిన తర్వాత చాలా మంది మధ్యతరగతి ప్రజల చేతుల్లో కూడా రెండు వేల రూపాయల నోట్లే కనిపించేవి.

RBI: రూ.2 వేల నోట్ల వాపస్.. కష్టాలన్నీ వాళ్లకే..
Money
Follow us on

రూ. 2 వేల నోట్లను వెనక్కి తీసుకుంటున్నట్లు రిజర్వు బ్యాంకు ఆంక్షలు విధిచడంతో సామాన్యులపై ఎంతవరకు ప్రభావం ఉంటుందోనన్న చర్చలు మొదలయ్యాయి. 2016లో నోట్ల రద్దు చేసిన తర్వాత చాలా మంది మధ్యతరగతి ప్రజల చేతుల్లో కూడా రెండు వేల రూపాయల నోట్లే కనిపించేవి. అయితే వాటికి చిల్లర దొరకడం కష్టంగా మారింది. దీంతో కేంద్ర ప్రభుత్వం రెండు వేల నోట్ల ముద్రణ ఆపేసి రూ. 500 నోట్ల సంఖ్యను పెంచింది. అయితే 2018 తర్వాత ఎక్కువగా రెండు వేల రూపాయల నోట్లు ఎక్కవగా వ్యాపారులు, సంపన్నుల దగ్గర మాత్రమే పోగయ్యాయి. సామాన్య ప్రజల దగ్గర మాత్రం రూ. 500 నోట్లే ఎక్కువగా తిరుగుతున్నాయి. అయితే తాజాగా ఆర్బీఐ నిర్ణయం తీసుకోవడంతో ఆ ప్రభావం సామన్యులపై పడేలా కనిపించడం లేదు. గతంలోలాగే నోట్ల రద్దు సమయంలో బ్యాంకులు, ఏటీఎంల దగ్గర భారీ స్థాయి క్యూలో నిల్చునే పరిస్థితులు ఉండవని బ్యాంకు అధికారులు అభిప్రాయపడుతున్నారు.

అలాగే ఇప్పటివరకు ప్రింట్ అయిన రెండు వేల రూపాయల నోట్లలో దాదాపు 73% మేర రిజర్వు బ్యాంకు దగ్గర ఉన్నట్లు తాజా ప్రకటన ద్వారా స్పష్టమవుతున్నది. ఇక మిగిలిన 27% మాత్రమే చెలామణిలో ఉన్నాయి. లెక్కలు ఇలా ఉన్నప్పటికీ కూడా రోజువారీ వ్యాపార లావాదేవీల్లో మాత్రం రెండు వేల నోట్లు కనిపించడం లేదు. ఇదే విషయాన్ని పార్లమెంటు వేదికగా కూడా కేంద్ర ఆర్థిక మంత్రి పలుమార్లు ప్రస్తావించారు. దీంతో ఇవన్నీ నల్లధనం పోగేసుకుంటున్న వ్యాపారులు, రాజకీయ నాయకులు, హవాలా మార్గంలో ట్రాన్సాక్షన్లు చేసేవారిదగ్గరే ఈ నోట్లు పెద్ద ఎత్తున ఉన్నాయనే అభిప్రాయం నెలకొంది.అయితే ఆర్బీఐ తాజా నిర్ణయంతో పేద, మధ్యతరగతి ప్రజలకు ఇబ్బందేమి ఉండదని.. ఒకవేళ వారిదగ్గర రెండువేల నోట్లు ఉన్నా అవి వైట్ మనీగానే వారి ఖాతాల్లో జమ అవుతాయని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం