BJP leader Rajinder Pal Singh Bhatia: ఛత్తీస్‌గఢ్ మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత రాజిందర్ పాల్ సింగ్ భాటియా ఆత్మహత్య చేసుకున్నారు. రాజ్‌నంద్‌గావ్ జిల్లాలోని తన నివాసంలో రాజిందర్ పాల్ సింగ్ భాటియా ఉరి వేసుకుని మరణించారు. సమచారం అనంతరం పోలీసులు ఆయన ఇంటికి చేరుకొని పరిశీలించారు. అనంతరం భాటియా మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలం నుంచి సూసైడ్ నోట్ లభించిందా లేదా అనే విషయాన్ని పోలీసులు ఇంకా నిర్ధారించలేదు.
కాగా.. చురియా పట్టణంలో నివాసముంటున్న భాటియాకు ఈ ఏడాది మార్చిలో కొవిడ్ పాజిటివ్ గా నిర్థారణ అయింది. కరోనా నుంచి కోలుకున్న అనంతరం భాటియా కొన్ని అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. రాజిందర్ పాల్ సింగ్ భాటియా రాజ్‌నంద్‌గావ్ జిల్లాలోని ఖుజ్జి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. భాటియా ముఖ్యమంత్రి రమణ్ సింగ్ నేతృత్వంలోని మొదటి బీజేపీ ప్రభుత్వంలో వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. రాజిందర్ పాల్ సింగ్ భాటియా భార్య కొన్ని సంవత్సరాల క్రితం మరణించింది.
Also Read: