Covid-19 vaccine: డిసెంబర్ నాటికి ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్.. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్..

|

May 24, 2021 | 11:13 AM

Gajendra Singh Shekhawat: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. నిత్యం లక్షలాది కేసులు, వేలాది మరణాలు నమోదవుతున్నాయి. ఈ తరుణలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా

Covid-19 vaccine: డిసెంబర్ నాటికి ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్.. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్..
Gajendra Singh Shekhawat
Follow us on

Gajendra Singh Shekhawat: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. నిత్యం లక్షలాది కేసులు, వేలాది మరణాలు నమోదవుతున్నాయి. ఈ తరుణలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. ఇంకా వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను వేగంగా చేపట్టేందుకు చర్యలు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో దేశంలోని ప్రతి పౌరుడికి డిసెంబర్‌ నాటికి టీకాలు వేస్తామని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ పేర్కొన్నారు. కోవిడ్‌ వ్యాక్సిన్ల ఉత్పత్తి పెంచేందుకు భారత్‌ వేగంగా కృషి చేస్తోందని వివరించారు. అయితే.. కరోనావైరస్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న టీకా డ్రైవ్‌ను రాజకీయం చేసేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయంటూ షెకావత్ ఆరోపించారు. టీకాల ఉత్పత్తి, లభ్యతను పెంచేందుకు నిరంతరం కేంద్రం కృషి చేస్తుందని, ప్రతి భారతీయుడికి డిసెంబర్‌ నాటికి టీకాలు వేస్తారని తెలిపారు. అప్పుడు ఇది ఒక భారీ రికార్డవుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. చరిత్రలో మొదటిసారిగా భారతదేశం ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు అనుగుణంగా వేగంగా కోవిడ్ వ్యాక్సిన్లను అభివృద్ధి చేసిందన్నారు.

అయితే.. దేశంలో అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ల నాణ్యత, ప్రామాణికత, సమర్థతను ప్రశ్నిస్తూ టీకా డ్రైవ్‌ను రాజకీయం చేసేందుకు ప్రతిపక్షాలు ప్రారంభం నాటినుంచి కృషి చేశాయంటూ విమర్శించారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాలతో దేశ ప్రతిష్టను దెబ్బతీశాయని ఆరోపించారు. ఇప్పుడు ఆయా పార్టీలకు చెందని వ్యక్తులే టీకా కోసం క్యూ కడుతున్నారన్నారు. కరోనా చికిత్సలో ఉపయోగించే రెమిడెసివిర్‌, బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సకు వినియోగించే ఆంఫోటెరిసిన్‌ మందుల ఉత్పత్తి భారీగా చేపడుతున్నట్లు వివరించారు. ఇక్కడ ఉత్పత్తి చేయడంతోపాటు.. విదేశాల నుంచి కూడా దిగుమతి చేసుకుంటున్నట్లు గజేంద్ర సింగ్ షెకావత్ వివరించారు.

Also Read:

Marriage in Plane: కరోనా ఎఫెక్ట్.. విమానంలో ఘనంగా పెళ్లి.. ప్రొటోకాల్ మిస్.. ఆ తర్వాత ఏమైందంటే..?

Weight Loss: వెల్లుల్లి, తేనె కలిపి తీసుకుంటే బరువు తగ్గడం ఖాయం.. వీటితో మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు..